ETV Bharat / bharat

కర్​నాటకం: సుప్రీంలో సభాపతికి చుక్కెదురు - SC

కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం తీర్పుపై పిటిషన్ దాఖలు చేశారు స్పీకర్​ రమేశ్​ కుమార్. ఈ పిటిషన్​పై ఈరోజు అత్యవసర విచారణ కుదరదని సుప్రీం తెలిపింది. ఇదే విషయంపై రేపు విచారణ ఉందని... ఆ సమయంలో వాదనలు వింటామని స్పష్టం చేసింది.

కర్​నాటకం: సుప్రీంలో సభాపతికి చుక్కెదురు
author img

By

Published : Jul 11, 2019, 6:08 PM IST

కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. 10 మంది అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈ రోజే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకించారు సభాపతి రమేశ్​ కుమార్​. రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత గడువు కావాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు స్పీకర్​.

అయితే.. సభాపతి పిటిషన్​ను అత్యవసరంగా విచారించాలని స్పీకర్​ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. ఈ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం రోజు అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్​తో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టుకు ఆ హక్కు లేదు..

సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టారు కర్ణాటక అసెంబ్లీ సభాపతి. ఎమ్మెల్యేల రాజీనామాలకు కారణం తెలుసుకోవాల్సి ఉందని.. విచారించేందుకు సమయం పడుతుందని పిటిషన్​లో పేర్కొన్నారు. స్పీకర్​ తరఫున అభిషేక్​ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

"రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్‌ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించడం సరికాదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చే హక్కు సుప్రీంకోర్టుకు లేదు."
-అభిషేక్​ మను సింఘ్వీ, స్పీకర్ తరఫు న్యాయవాది

ఎమ్మెల్యేల తీరును తప్పుబట్టిన సభాపతి

తనను కలవడానికి 10 మంది అంసతృప్త ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు స్పీకర్ రమేశ్​ కుమార్​. శాసనసభ్యులు తనను కలవాలనుకుంటే అధికారిక కార్యాలయంలో అందుబాటులోనే ఉంటానని చెప్పారు.

నేనెందుకు రాజీనామా చేయాలి?: కుమార స్వామి

మరోవైపు ముఖ్యంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కుమార స్వామి తేల్చి చెప్పారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఎందుకు రాజీనామా చేయాలని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. 2009-10 సం.లో మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు అప్పటి భాజపా ముఖ్యమంత్రి బీఎస్​ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా వ్యతిరేకించినా ఆయన రాజీనామా చేయలేదని గుర్తు చేశారు కుమార స్వామి.

ఇదీ చూడండి: రైతులు ఘోషిస్తున్నారు.. పట్టించుకోండి: రాహుల్

AP Video Delivery Log - 1000 GMT News
Thursday, 11 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0938: China MOFA Briefing AP Clients Only 4219929
DAILY MOFA BRIEFING
AP-APTN-0923: Bangladesh Climate AP Clients Only 4219935
Ex-UN chief concerned over Rohingya camp floods
AP-APTN-0901: French Guiana Arianespace Logo cannot be obscured 4219925
Arianespace apologises for satellite launch failure
AP-APTN-0900: US MA Bus FIre Must credit WCVB; No access Boston; No use by US broadcast networks; No re-sale, reuse or archive 4219932
International students unhurt after US bus fire
AP-APTN-0858: Greece Storm 2 No access Greece 4219931
Aftermath of deadly storm that struck Greece
AP-APTN-0850: Thailand ASEAN Defence AP Clients Only 4219930
ASEAN defence ministers discuss security proposal
AP-APTN-0828: Greece Storm No access Greece 4219928
Aftermath of deadly storm that struck Greece
AP-APTN-0820: Japan Stilwell AP Clients Only 4219927
Top US diplomat starts his first tour of Asia
AP-APTN-0811: UK Attenborough Reef News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of use; No Archive 4219921
Attenborough alert over Great Barrier Reef
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.