ETV Bharat / bharat

రైల్వే టాయిలెట్ల రంగుపై ఆ పార్టీ గరం!

ఉత్తర్​ప్రదేశ్​లో టాయిలెట్లకు వాడిన రంగుల విషయంలో రైల్వే శాఖపై సమాజ్​వాదీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్​పీ జెండా రంగులైన ఎరుపు, ఆకుపచ్చ టైల్స్​తో గోరఖ్​పుర్​ రైల్వే ఆసుపత్రిలో టాయిలెట్లను నిర్మించటాన్ని తప్పుబట్టింది.

toilet sp
సమాజ్​వాదీ పార్టీ
author img

By

Published : Oct 29, 2020, 5:17 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లోని రైల్వే ఆసుపత్రిలో నిర్మించిన మరుగుదొడ్లపై సమాజ్​వాదీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టాయిలెట్లపై ఎరుపు, ఆకుపచ్చ టైల్స్ వాడటం.. అవే రంగుల్లో ఉండే తమ పార్టీ జెండాను కించపరిచే విధంగా ఉందని ఆరోపించింది.

toilet sp
రైల్వే ఆసుపత్రిలో టాయిలెట్లు
toilet sp
ఎస్​పీ కార్యకర్తల నిరసన

ఈ విషయంపై నగరంలోని ఎస్​పీ కార్యాలయంలో పార్టీ నేతలు గుమిగూడి నిరసన చేపట్టారు. ఇందుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటిపై నల్ల రంగు పూశారు.

toilet sp
నల్ల రంగు పూసి.. నిరసన
toilet sp
ఎస్​పీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు

"మా పార్టీ జెండాకు జరిగిన అవమానాన్ని మేం సహించం. రైల్వే విభాగం వాటిని మార్చాలి. దీని వెనుక ఎవరున్నారో జిల్లా పాలనా విభాగం గుర్తించాలి. వీటిని 3, 4 నెలల ముందే కట్టారు. కానీ, మా దృష్టికి ఇప్పుడే వచ్చింది. వెంటనే చర్యలు తీసుకోకపోతే రోడ్లపై నిరసన చేపడతాం. "

- రామ్​ నగీనా, ఎస్పీ జిల్లా అధ్యక్షుడు

ఇదీ చూడండి: భూ చట్టాలకు వ్యతిరేకంగా పీడీపీ ఆందోళన- పలువురి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.