ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయ్‌బరేలీ లోక్‌సభ నుంచే సోనియా మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలతో ఎనలేని బంధం ఉందన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు.
ప్రధాని మోదీపై సోనియా విమర్శలు చేశారు. 2014లో ఇచ్చిన వాగ్దానాలను మోదీ నెరవేర్చలేదని, ఇది ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల ఖాతాల్లోకి రూ.15 లక్షలు, 2 కోట్ల ఉద్యోగాల హామీల మాటేమైందని ప్రశ్నించారు. తప్పుడు హామీలిచ్చిన భాజపాకు ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు సోనియా.
"కొద్ది రోజుల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు మీ చేతిలో ఉన్న పెద్ద ఆయుధం. ఎవరైతే మీకు తప్పుడు హామీలిచ్చారో... మీ ఓటుతో వారికి బుద్ధిచెప్పండి." -- సోనియా గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్