ETV Bharat / bharat

కరోనా వేళ 'సోషల్​ మీడియా' అవకాశమా? అనర్థమా? - యూట్యూబ్​

కొవిడ్​-19 వంటి మహమ్మారులు విస్తరిస్తున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సమాచారం తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తాయి. సోషల్​ మీడయం ద్వారా ప్రతి విషయాన్ని స్నేహితులు, బంధువులు, ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. అయితే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల ఉపయోగకరమేనా? లేదా అనర్థాలకు దారి తీస్తాయా?

Social media and COVID-19: opportunity or disaster?
సోషల్ మీడియాలో వచ్చే వన్నీ నమ్మేయొద్దు.. నిర్ధారించుకోండిలా!
author img

By

Published : Apr 9, 2020, 10:46 AM IST

దేశవ్యాప్త లాక్​డౌన్​ కొనసాగుతున్న వేళ సామాజిక మాధ్యమాలు సమాచారం తెలుసుకునేందుకు కీలకంగా మారాయి. ఫేస్​బుక్​, ట్విట్టర్​, వాట్సాప్​, నెట్​వర్కింగ్​, ఫోటో షేరింగ్​, మైక్రోబ్లాగింగ్​ వంటి సైట్లు, యాప్​లు రోజువారి జీవితంలో భాగమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలతో ఎంత ఉపయోగం ఉంటుందో.. అంతే ప్రమాదం ఉంటుంది. సోషల్​ మీడియాలు రెండువైపుల పదును కలిగిన కత్తి వంటివి. సరైన, అధికారిక సమాచారాన్ని పంచుకున్నట్లే.. పుకార్లు, తప్పుడు వార్తలను అంతే సులభంగా షేర్​ చేయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి.

గత రెండు వారాల్లో సామజిక మాధ్యమాల్లో కొవిడ్​-19పై ఎంత మేర నిజమైన సమాచారం వచ్చిందో.. దానికి రెట్టింపు వదంతులు వ్యాప్తి చెందాయి.

కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా చేతులను శుభ్రం చేసుకోవటం, భౌతిక దూరం పాటించటం, స్వీయ నిర్బంధంపై చిత్రాలు, వీడియోలు గ్రాఫిక్స్​తో కూడిన సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వెళ్లింది. ఉదాహరణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు కరోనాపై జాగ్రత్తలను వివరించేందుకు వీటినే ఉపయోగించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మార్చి 22న కొవిడ్​పై పోరాటం చేస్తోన్నవారికి మద్దతుగా యావత్​ భారతావని చప్పట్లు కొట్టి మద్దతిచ్చారు. ఈ విషయాన్ని లక్షల మంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కరోనా వల్ల వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్న ఎంతో మంది వలస కూలీలకు ఆహారం, నిత్యావసరాలు అందించడానికి సోషల్​ మీడియా ఎంతగానే ఉపయోగపడింది.

ప్రముఖులు సైతం..

లాక్​డౌన్​ పాటిస్తూ పలువురు ప్రముఖులు వీడియోలు, సందేశాలను సోషల్​ మీడియాలో పంచుకుంటున్నారు. శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, వైద్య రంగ నిపుణులు.. ప్రభుత్వ విధానాలపై చర్చించటం, తాజా వార్తలను పంచుకోవటం, మద్దతు తెలుపుతూ సందేశాలు అందిస్తున్నారు. వార్తా సంస్థలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.

వదంతులతో జైలు శిక్ష..

తప్పుడు సమాచారాన్ని షేర్​ చేసి జైలు పాలైన వారూ ఉన్నారు. ముంబయి, కొల్హాపూర్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు దంపతులకు కరోనా సోకినట్లు పుకార్లను సామాజిక మాధ్యమం వేదికగా పంచుకోగా వారిని అరెస్టు చేశారు. కోల్​కత్తాలోనూ కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పంచుకున్న 29 ఏళ్ల మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తప్పుడు సమాచారం నాలుగు రకాలు..

  1. తెలియని, తప్పుడు సమాచారాన్ని ప్రజలు పంచుకుంటారు. అది ఉపయోగకరంగా ఉంటుందని వారు భావిస్తారు కాబట్టి దానిని వ్యాప్తి చేస్తారు. ఇలాంటి సమాచారం వారిలోని భయాలతో కూడుకున్నదే కానీ.. దానికి ఆధారాలు ఉండవు.
  2. ప్రజలు వారి నమ్మకాలపై ఆధారపడి తప్పుడు సమాచారాన్ని పంచుకుంటారు.
  3. తప్పుడు సమాచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.
  4. పాత వార్తలు, తప్పుడు వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతాయి.

తప్పుడు సమాచారం తెలుసుకోవటం ఎలా..

తప్పుడు వార్తల భ్రమలో పడకుండా సామాజిక మాధ్యమాలను ఉపయోగించేందుకు కొన్ని విజయవంతమైన మార్గాలు ఉన్నాయి. ఫేస్​బుక్​, వాట్సాప్​, ట్విట్టర్​ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం అందినపుడు.. సరైనదో కాదో తప్పక నిర్ధరణ చేసుకోవాలి.

  • మూలాలు.. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం నమ్మదగినదా లేదా అని గుర్తించేందుకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. వార్తాపత్రికలు, టీవీలు, రేడియో వంటి విశ్వసనీయ వనరులతో తనిఖీ చేయాలి. ఇంకా నమ్మదగినదిగా అనిపించకపోతే.. నిపుణుల సలహాలు తీసుకోవాలి.
  • వార్తా నాణ్యత.. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్త.. వాస్తవాలపై ఆధారపడి ఉందా లేక అభిప్రాయంతో వచ్చిందా అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. వార్తల్లో అక్షర దోషాలు, పదాల ఉచ్ఛరణలో తడబాటు వంటివి గుర్తిస్తే.. తప్పుడు సమాచారంగా భావించాలి.
  • ఆధారాలు.. సాధారణంగా తప్పుడు వార్తలకు సరైన ఆధారాలు, గుర్తింపు పొందిన వెబ్​సైట్లలను సూచించవు. ఉదాహరణకు మనకు వచ్చిన ఫొటోలు గురించి తెలుసుకోవాలంటే గూగుల్​లో రివర్స్ ఇమేజ్​ సెర్చ్​ చేయడం వల్ల ఫోటో సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. అది ఇంతకు ముందు ఎప్పుడు వాడారు. ఆ ఫోటో ఎవరికి సంబంధించినది అనే సమాచారం వస్తుంది. దీంతో పాటు మనం వాడొచ్చా లేదా కూడా తెలుస్తుంది.

ఇదీ చదవండి: 'దేశంలో సామాజిక అత్యవసర పరిస్థితి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.