ETV Bharat / bharat

దిల్లీ మెట్రో స్టేషన్​లో 'పౌర' నినాదాలు - ఢిల్లీ వార్తలు ఈరోజు

దిల్లీలోని ఓ మెట్రో స్టేషన్​లో పౌరచట్టానికి అనుకూలంగా కొందరు యువకులు నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమయిన భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

DEL-SLOGAN
మెట్రోస్టేషన్
author img

By

Published : Feb 29, 2020, 4:00 PM IST

Updated : Mar 2, 2020, 11:22 PM IST

దిల్లీ మెట్రో బ్లూలైన్​ మార్గంలోని ఓ రైలులో కొంతమంది పౌరసత్వ చట్టానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కాషాయ టీ-షర్టు, కుర్తా వేసుకున్న ఆరుగురు వ్యక్తులు రాజీవ్​ చౌక్​ మెట్రో స్టేషన్​లో రైలు ఆగుతున్న వేళ నినాదాలు చేయటం ప్రారంభించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత స్టేషన్​లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

రాజీవ్​ చౌక్ స్టేషన్​

వీరికి కొంతమంది ప్రయాణికులు జతకలిసి నినాదాలు చేశారు. మరికొంత మంది ఆ చిత్రాలను తమ చరవాణిల్లో చిత్రీకరించారు. వీరిని దిల్లీ మెట్రో భద్రత బాధ్యతలు చూసుకునే సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

"ఆరుగురు యువకులు రాజీవ్​ చౌక్​ మెట్రో స్టేషన్​లో నినాదాలు చేశారు. వాళ్లను సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దిల్లీ మెట్రో రైల్ పోలీస్​ అధికారులకు అప్పగించారు. మెట్రో సేవలు యథావిధిగా కొనసాగుతాయి."

- కేంద్ర పరిశ్రమల భద్రతా దళం

నినాదాలు చేసిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని మెట్రో డీసీపీ విక్రమ్​ పర్వాల్​ తెలిపారు.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది.

Last Updated : Mar 2, 2020, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.