వరుణుడి రాకకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ ఏడాది నిరాశ తప్పేలా లేదు. దేశానికి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కానుందని వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటించింది. జూన్ 7న కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపింది. గతంలో జూన్ 4నే వస్తాయని ప్రకటించినప్పటికీ.. వాతావరణ మార్పుల దృష్ట్యా మరింత ఆలస్యంగా వస్తాయని తెలిపింది
అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు మే 18న వస్తాయని గతంలో పేర్కొంది స్కైమెట్. అనంతరం మే 20న వస్తాయని తెలిపింది. అయితే ఇప్పటికీ అండమాన్ దీవులను పలకరించకపోవడం గమనార్హం.
భారత వాతావరణ శాఖ సైతం రుతుపవనాలు జూన్ 6న కేరళను తాకుతాయని ప్రకటించింది.
లోటు వర్షాపాతం..
ఈ ఏడాది మధ్య, తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో... దక్షిణ ద్వీపకల్పం, వాయవ్య భారత ప్రాంతాలతో పోల్చితే లోటు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది స్కైమెట్. దేశవ్యాప్తంగా సాధారణం కంటే లోటు వర్షపాతమే ఉంటుందని గతంలో తెలిపింది.
ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చేదు కబురు