ETV Bharat / bharat

హైకోర్టు 'లైంగిక వేధింపుల తీర్పు'పై సుప్రీం స్టే

లైంగిక వేధింపులకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దుస్తుల పైనుంచి తాకితే అది లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.

Skin to Skin contact: SC stays Bombay HC order acquitting man under POCSO
హైకోర్టు 'లైంగిక వేధింపుల తీర్పు'పై సుప్రీం స్టే
author img

By

Published : Jan 27, 2021, 3:07 PM IST

Updated : Jan 27, 2021, 3:57 PM IST

పోక్సో చట్టం ప్రకారం.. దుస్తుల పైనుంచి తాకితే అది లైంగిక వేధింపుల కిందకు రాదన్న బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు జస్టిస్​ ఎస్​ ఏ బొబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్​ రామసుబ్రమణియన్​తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా అప్పీల్ చేసేందుకు అటార్నీ జనరల్​కు అనుమతి ఇచ్చింది.

లైంగిక వేధింపుల కింద పరిగణించలేం

పోక్సో చట్టం ప్రకారం.. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని వివరిస్తోందని వ్యాఖ్యానించింది. బాలిక వక్షస్థలాన్ని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా లేక దుస్తుల లోపల చేయి పెట్టాడా? అన్న దానిపై సరైన ఆధారాలు లేవని... కాబట్టి దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని తెలిపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటే కచ్చితమైన, బలమైన సాక్ష్యాధారాలు ఉండాలని వివరించింది. కానీ మహిళ/బాలిక పరువుకు భంగం కలగాలన్న ఉద్దేశంతో ఆమె వక్షస్థలాన్ని తాకితే మాత్రం.. అది క్రిమినల్​ నేరంగా పరిగణించవచ్చని తెలిపింది.

కేసు పూర్వాపరాలివీ

2016 డిసెంబర్​లో 39 ఏళ్ల సతీశ్ అనే వ్యక్తి 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి పోక్సో చట్టం కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్​ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసింది. దిగువ కోర్టు విధించిన 3 సంవత్సరాల శిక్షను ఏడాది కఠిన కారాగార శిక్షగా మార్చేందుకు సమర్థించింది.

ఇదీ చదవండి : 'దుస్తుల మీద నుంచి తాకితే లైంగిక వేధింపులు కాదు'

'లైంగిక వేధింపులపై హైకోర్టు తీర్పు దారుణం'

Last Updated : Jan 27, 2021, 3:57 PM IST

For All Latest Updates

TAGGED:

POCSO ACT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.