ETV Bharat / bharat

ఆరేళ్ల బాలిక...రోజంతా అడవిలోనే! - పాప ఆచూకీ తెలుసుకొన్న అటవీ అధికారులు

అమ్మ, నాన్నతో కలిసి పొలం వద్దకు వెళ్లిన ఓ ఆరేళ్ల బాలిక తప్పిపోయింది. ఆటలో నిమగ్నమై... ఐదు కిలోమీటర్ల మేరకు అడవిలోకి వెళ్లిపోయింది. అమ్మా... అమ్మా అని ఏడుస్తూ దాదాపు 24 గంటలు చెట్ల మధ్యనే తిరిగిన ఆ బాలికను ప్రాణాలతో కాపాడారు అటవీ శాఖ అధికారులు.

6Yr old_Jungle
అమ్మా అని అరుస్తూ...అడవిలోనే రోజంతా!
author img

By

Published : Nov 13, 2020, 5:02 PM IST

అమ్మా..అమ్మా అని అరుస్తూ ఓ ఆరేళ్ల బాలిక అడవిలోనే రోజంతా గడిపింది. అమ్మ, నాన్న పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా ఆ బాలిక అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది. కర్ణాటకలోని కొమరనహల్లి అడవిలో తప్పిపోయిన ఆ బాలికను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు అటవీ శాఖ అధికారులు.

ఆడుకుంటూ అడవిలోకి...

దావణగిరి జిల్లా మెలబెన్నూర్​లోని కొమరనహల్లి అడవిలో తప్పిపోయింది ఆ ఆరేళ్ల బాలిక. దాదాపు ఐదు కిలో మీటర్లు నడుకుంటూ వెళ్లిపోయింది. కూతురు ఆచూకీ తెలియకపోవడంతో పాప తల్లితండ్రులు కంగారు పడిపోయారు.

దాదాపు 24 గంటలు అడవిలోనే ఏడుస్తూ ఉండిపోయిన ఆ బాలికను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అమ్మా... అమ్మా అనే ఏడుపు వినిపించిందని.. దీంతో, తప్పిపోయిన బాలిక ఆచూకీ తెలిసిందని పేర్కొన్నారు అధికారులు. చిన్నారిని వెంటనే తల్లితండ్రులకు అప్పగించారు.

ఇదీ చదవండి:విపత్తు సాయం కింద 6 రాష్ట్రాలకు రూ.4,382 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.