దిల్లీలో సాధారణ పరిస్థితులు కనిపించడం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ప్రజలంతా భయం గుప్పిట్లోనే జీవిస్తున్నారని పేర్కొంది. అల్లర్లపై ఏకపక్ష దర్యాప్తు జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు.
కేంద్రం, దిల్లీ సీఎంపై ఎటువంటి నమ్మకం లేదని, న్యాయస్థానంపైనే ఆశలు పెట్టుకున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా రాజధానిలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 43 మంది మరణించారు.