వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఉద్యమిస్తున్న రైతులకు సిస్‌గంజ్ గురుద్వారాకు చెందిన సేవా కార్యకర్తలు సరికొత్త రూపంలో మద్దతు తెలిపారు. ఈ కార్యకర్తల్లో వ్యాపారులు, మహిళలు, వివిధ వర్గాలకు చెందిన వారున్నారు. సింఘు సరిహద్దుల్లోని దీక్ష శిబిరాల వద్ద రైతుల బూట్లను స్వచ్ఛందంగా తీసుకొని శుభ్రం చేసి ఇస్తున్నారు.
నెలన్నర రోజులకు పైగా దీక్షలో పాల్గొంటున్న కర్షకుల బూట్లు.. వర్షం, మంచు కారణంగా పాడయ్యాయని, వాటిని బాగుచేసి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని 'జోడా సేవ'లో పాల్గొంటున్న జస్విందర్ సింగ్, ఇందర్‌జిత్ సింగ్ అనే వ్యాపారులు తెలిపారు. రైతులను అన్నదాతలు, యోధులని ప్రశంసించారు. దీక్ష శిబిరాల వద్దకు వస్తున్న ఇతరులకూ జోడా సేవ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిఫలం ఆశించకుండా, వివక్ష చూపకుండా సేవ చేయాలని గురుద్వారా తమకు బోధించిందని దిల్లీకి చెందిన కిరణ్‌జీ అనే మహిళ వెల్లడించారు.
ఇదీ చూడండి: సాగుచట్టాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు