ఈశాన్యాన చిన్న రాష్ట్రమైన సిక్కింలో ఎన్నికల పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించిన పవన్‌చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్)కు, ప్రత్యర్థి పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం)కు మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది.
ఈ రాష్ట్రంలో ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలకుగాను ఎస్డీఎఫ్ 22 గెల్చుకుంది. ఎస్కేఎం 10 స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఇక్కడ జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల హవా తక్కువ.
పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌర రిజస్టర్ వివాదంతో రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితి నెలకొంది. దీనిపైనే ప్రతిపక్షాలు ప్రచారం నిర్వహించాయి. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక లోక్ సభ నియోజకవర్గంలో ఎస్కేఎం ఆధిక్యంలో ఉంది.
రికార్డులు...
ఆరోసారి ఎన్నికల్లో పోటీకి దిగారు పవన్ చామ్లింగ్. ఈసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైతే.. ఇప్పట్లో ఈయన రికార్డుకు ఎదురే ఉండదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా జ్యోతి బసు రికార్డును ఇప్పటికే అధిగమించారు చామ్లింగ్.