ETV Bharat / bharat

'అందరి అంగీకారం ఉండే దేశాన్ని చూపండి' - గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ వార్తలు

భారత్​కు సంబంధించిన విదేశీ వ్యవహారాలు, సీఏఏ ఆందోళనలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగమంత్రి జైశంకర్. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ వేదికగా ప్రభుత్వ విధానాలను విశదీకరించారు. జమ్ముకశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులపై ఐరాస మానవ హక్కుల మండలి ఆందోళన వ్యక్తం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

JAISHANKAR
'అందరి అంగీకారం ఉండే దేశాన్ని చూపండి'
author img

By

Published : Mar 7, 2020, 4:12 PM IST

Updated : Mar 8, 2020, 7:49 AM IST

ప్రపంచంలోని ఏ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికైనా ప్రజల్లో ఏకాభిప్రాయం ఉండదని పేర్కొన్నారు విదేశాంగమంత్రి జైశంకర్. జమ్ముకశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఆందోళన వ్యక్తం చేయడం సరికాదన్నారు జైశంకర్. ఐరాస మానవహక్కుల మండలి డైరెక్టర్ గతంలోనూ ఇలాగే స్పందించారన్నారు.

అదే సమయంలో భారత విదేశాంగ విధానంపై ఆసక్తికర సమాధానమిచ్చారు జైశంకర్. ఇప్పుడే అసలైన మిత్రులెవరో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

"ప్రశ్న: అమెరికాలో డెమొక్రాట్లు భారత్​పై ఆగ్రహంగా ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అబ్దుల్ ఖమేనీ నుంచి అసంతృప్తి వంటి అంశాలు మనం మిత్రులను కోల్పోవడం అవుతుందా?

జవాబు: మనం అసలైన స్నేహితులవరో తెలుసుకుంటున్నాం. ఇక్కడ రెండు అంశాలున్నాయి. ఒకటి ప్రధానమంత్రి విధానం. రెండోది భౌగోళిక, రాజకీయ పరిస్థితులు. గతంలో భారత్ రక్షణాత్మక ధోరణిలో ఉంది. నాడు మన సామర్థ్యాలు తక్కువ, మనకున్న భయాలు, రిస్కులు ఎక్కువ. ఈ నేపథ్యంలో మనం ప్రపంచంతో సంబంధాలు నెరిపే విధానాన్ని అవలంబించాం. కానీ అది ఇప్పుడు ఆచరణాసాధ్యం కాదు.. మనం ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతాం. ప్రపంచ విధానాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ఆత్మవిశ్వాసం పెరిగింది. మన ఆసక్తులు పెరిగాయి. మనం వీటిని విభిన్నంగా నిర్వహించాలి. ఇది ఓ పోర్ట్​ఫోలియో నిర్వహణ వంటిది."

-జైశంకర్, విదేశాంగమంత్రి

'అందరి అంగీకారం ఉండే దేశాన్ని చూపండి'

ఇదీ చూడండి:కరోనా కట్టడికి ఆన్​లైన్​ సంస్థల సరికొత్త ఆలోచన..!

Last Updated : Mar 8, 2020, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.