ETV Bharat / bharat

నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలి: షా - అలీ

నక్సలిజాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేయాలని కేంద్ర హోం మంత్రి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యతిరేకమైన నక్సలిజం నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేయాలన్నారు. ఇందుకోసం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు అమిత్​ షా.

నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలి
author img

By

Published : Aug 27, 2019, 5:47 AM IST

Updated : Sep 28, 2019, 10:13 AM IST

నక్సలిజంపై హోంశాఖ దృష్టి

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పిలుపునిచ్చారు. ఈ మేరకు 10 మావోయిస‌్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు షా. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

బ్యాంకులు, తపాలా వంటి మౌలిక సౌకర్యాలు సహా కేంద్ర పథకాలను మరింత సులువుగా ఉపయోగించుకునేలా చూడాలని తీర్మానించారు. మావోయిస్టులకు వ‌్యతిరేకంగా చేపట్టిన చర్యలు, ప్రభావిత ప్రాంతాల్లో అనుసరించిన అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రులకు వివరించారు అమిత్ షా.

తెలుగు రాష్ట్రాలకు ప్రశంసలు

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ ఉపముఖ‌్యమంత్రి మహమ్మూద్ అలీ సహా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిథులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. నక్సల్స్ నిర్మూలన చర్యల్లో ఏపీ, తెలంగాణ సఫలీకృతమయ్యాయని సమావేశం ప్రారంభంలో హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కొనియాడారు.

10 జిల్లాలే కీలకం

దేశం మొత్తం మీద 10 జిల్లాల్లోనే నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు గురించి ఆలోచన వద్దని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పినట్లు సమాచారం.

అభివృద్ధే ప్రధానం

ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి తప్ప మరో అంశానికి తావు ఉండకూడదని అమిత్ షా సూచించారు. శాఖల మధ్య సమన్వయం నిత్యం జరగాలని, తాను కూడా స్వయంగా పాలుపంచుకుంటానని సమావేశంలో అమిత్ షా చెప్పినట్లు సమాచారం. నక్సలిజం నిర్మూలనకు సమావేశంలో చాలా అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

  • రూ. 50 లక్షల వరకు జరిగే పనులను నామినేషన్ పద్ధతిలో స్థానికులకే ఇచ్చేలా మార్పులు.
  • గతంలో ఉన్న 5 లక్షల పరిధిని 50 లక్షలకు పెంచేందుకు ఆమోదం
  • ప్రతి గ్రామానికి అందుబాటులో టవర్ల ఏర్పాటు, బ్యాంకులు, తపాలా సేవలు
  • అవకాశం ఉన్న చోట్ల ఏటీఎంల ఏర్పాటు
  • కేంద్ర నుంచి అందే నగదు బదిలీ పథకాలను అక్కడి ప్రజలు సులువుగా వినియోగించుకునేలా చర్యలు

వైద్య సదుపాయం ముఖ్యం: జగన్​

గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య కళాశాల, ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి హాజరైన జగన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక గిరిజన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బలగాలు కావాలి: అలీ

ఛత్తీస్​గఢ్​తో సరిహద్దులు పంచుకోవటం వల్ల తెలంగాణకు మరిన్ని బలగాలను ఇవ్వాలని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్​ అలీ కోరారు.

ఇదీ చూడండి: వివాదాస్పదం: భాజపా ఎంపీ ప్రగ్యా​ సంచలన వ్యాఖ్యలు

New Delhi, Aug 26 (ANI): Jharkhand Chief Minister Raghubar Das met Union Minister of Parliamentary Affairs Pralhad Joshi on August 26. He also met Union Minister of Environment Prakash Javadekar in the national capital. During the meeting, they discussed several issues related to the state of Jharkhand.
Last Updated : Sep 28, 2019, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.