దిల్లీలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో మరోసారి భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. దేశ రాజధానిలో కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో కలిసి ఇవాళ రెండోసారి సమీక్షిస్తున్నారు షా.
దిల్లీలో కరోనా కేసుల కట్టడికి తీసుకున్న చర్యలపై కేజ్రీవాల్, అనిల్ బైజల్‌తో ఈ ఉదయమే చర్చించారు కేంద్ర హోంమంత్రి. అనంతరం అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులను తక్షణమే దిల్లీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.