దిల్లీ అగ్నిప్రమాదం జరిగిన భవన యజమాని అరెస్టు
దిల్లీ అనాజ్‌మండీ అగ్నిప్రమాదం జరిగిన పరిశ్రమ భవనం యజమాని, అతని మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యజమాని రేహాన్‌పై ఐపీసీ 304 కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం పరిశ్రమలో మంటలు ఎగిసిపడి ఇప్పటివరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు.