కరోనా మహమ్మారి దృష్ట్యా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంతిళ్లకు తీసుకొచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ను మే 7న ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 17.22 లక్షల మంది స్వదేశానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అక్టోబర్లో 1873 విమానాలు
వందే భారత్ మిషన్లో భాగంగా అక్టోబర్లో భారత్ నుంచి 25 దేశాలకు 1,875 విమానాలు నడిచాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ 25 దేశాల్లో 14 దేశాలు భారత్తో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్నవేనని మీడియాతో జరిపిన వర్చువల్ సమావేశంలో వివరించారు.
స్వదేశంలో 24 విమానాశ్రయాల్లోకి
ఏడో దశలో సేవలందించిన విమానాల్లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ప్రైవేటు, విదేశీ విమానాలు, చార్టెడ్ విమానాలు ఉన్నాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ సేవలను అందించేందుకు స్వదేశంలోని 24 విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. రానున్న రోజుల్లో అవసరాల రీత్యా మరికొన్ని విమానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:పండుగల వేళ విమాన సర్వీసులు పెంపు!