రెండు గ్రూపుల మధ్య తగాదా.. యాసిడ్ దాడికి దారితీసింది. ఏదో అంశంలో గొడవపడిన అనంతరం ఒక గ్యాంగ్ మరో సమూహంపై యాసిడ్ దాడి చేసింది. మహారాష్ట్ర భివండీలోని సైనత్ నగర్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారందరినీ ఇందిరా గాంధీ సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రికి తరలించారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన దుండగులను గుర్తించే పనిలో పడ్డారు.