ETV Bharat / bharat

తమిళనాడుకు వెళ్లనున్న ఎన్నికల సంఘం అధికారి - తమిళనాడు, పాండిచ్చేరిలో ఎన్నికల నిర్వహణ సన్నాహాలకు ఎన్నికల అధికారి

తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పరిశీలించేందుకు ఓ ఉన్నతాధికారిని ఎన్నికల సంఘం పంపనుంది. సోమ, మంగళవారాల్లో తమిళనాడులో..బుధవారం పుదుచ్చేరిలో ఆయన గడపనున్నారని అధికార వర్గాల సమాచారం. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను అంచనా వేయనున్నారు.

Senior EC official in TN, Puducherry beginning Monday to oversee poll preparations
తమిళనాడు, పాండిచ్చేరిల్లో ఎన్నికల సన్నాహాలకు ఈసీ ఉన్నతాధికారి
author img

By

Published : Dec 20, 2020, 10:08 PM IST

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఎన్నికల సంఘం ముమ్మరం చేస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరిలకు ఈసీ సెక్రటరీ జనరల్ ఉమేష్​ సిన్హాను పంపనుంది.

సోమ, మంగళవారాల్లో తమిళనాడులో..బుధవారం పుదుచ్చేరిలో ఉమేష్ సిన్హా గడపనున్నారని అధికార వర్గాల సమాచారం. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను ఆయన అంచనా వేయనున్నారు.

తమిళనాడు, పశ్చిమ్​ బంగా, అసోం, కేరళ, పుదుచ్చేరిలో 2021ఏప్రిల్-జూన్​మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:దాడులకు భయపడం- మా గెలుపు తథ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.