ETV Bharat / bharat

'ఆత్మనిర్భర్​ భారత్​లో ప్రపంచ సంక్షేమమూ భాగమే' - ఆత్మనిర్భర్ భారత్​

శాస్త్రీయ పరిశోధనల్లో యువత భాగం కావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వైభవ్ సదస్సు-2020 ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రపంచ సంక్షేమం కోసం ఆత్మనిర్భర్​ భారత్​ను రూపొందించామని స్పష్టం చేశారు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మద్దతు కోరారు మోదీ.

PM-VAIBHAV SUMMIT
ప్రధాని నరేంద్రమోదీ
author img

By

Published : Oct 2, 2020, 8:40 PM IST

వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్​గా పిలిచే 'వైభవ్​ సదస్సు-2020'ను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్​ వేదికగా ప్రారంభించారు. విదేశాల్లోని భారతీయ పరిశోధకులు, విద్యావేత్తలను ఒకేచోట చేర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. శాస్త్రవేత్తలు, విద్యావేత్తల కృషిని ప్రశంసించారు.

"ఇది గొప్ప మేధావుల సంఘం. శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలను పెంచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. సామాజిక-ఆర్థిక సంస్కరణలకు సైన్స్​ ప్రధాన ఆధారం. రైతులకూ సాయపడే విధంగా ఉన్నత స్థాయి శాస్త్రీయ పరిశోధనలు అవసరం. ధాన్యం ఉత్పత్తులను పెంచేందుకు మన శాస్త్రవేత్తలు కష్టపడి పనిచేశారు. విజ్ఞాన శాస్త్రంలో యువత ఆసక్తి పెంచుకోవాల్సిన సమయమిది."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

'కలిసి రండి..'

ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మనిర్భర్ భారత్​ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రవాస భారతీయులు గుర్తించి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇటీవలే అంతరిక్ష పరిశోధన రంగంలో మార్పులు తెచ్చామని, ఇది పరిశ్రమలతో పాటు విద్యా విషయంలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

వ్యాక్సిన్ ఉత్పత్తిపై..

దేశీయంగా వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రోత్సహించామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించి 2014లో నాలుగు కొత్త వ్యాక్సిన్లను ప్రవేశపెట్టామని.. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన రొటా వైరస్ వ్యాక్సిన్​ కూడా ఉందని స్పష్టం చేశారు.

55 దేశాల్లోని 3వేల మంది..

ఈ సదస్సులో 55 దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది భారత మూలాలు ఉన్న విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ముఖ్య సాంకేతిక సలహాదారు నేతృత్వంలో సుమారు 200 విద్యాసంస్థలు.. ఎస్​ అండ్ టీ సంస్థలు సహా 40 దేశాలకు చెందిన 15 వందల మంది ప్యానలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అక్టోబర్‌ 31న సర్ధార్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని ముగింపు కార్యక్రమం నిర్వహించాలని నిర్వాహాకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: రాజ్​ఘాట్​ వద్ద మహాత్ముడికి మోదీ నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.