సేజల్ షా ఓ సాధారణ గృహిణి. వేసవితాపం నుంచి ఉపశమనం కోసం ప్రకృతి సిద్ధంగా లభ్యమవుతున్న ఆవుపేడతో ఇంటిని అలుకుతారు.
ఇది వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తోందని సేజల్ గ్రహించారు. ఇదే అంశాన్ని తన కారుపై ఎందుకు ప్రయోగించకూడదు? అనే వినూత్న ఆలోచన ఆమె మదిని తట్టింది.
అంతే తన గొడ్ల చావడిలో ఉన్న ఆవుపేడను కారుకు పూశారు. చెల్లదనంతో దర్జాగా దానిలో కూర్చొని నగరమంతా చక్కర్లు కొడుతున్నారు.
"మా ఇంట్లో ఆవుపేడను తరచూ వినియోగిస్తాం. ఆ అనుభవంతోనే ఈ ఆలోచన తట్టింది. వేసవి కాలంలో చల్లగా, శీతకాలంలో వెచ్చగా ఉంటుంది. కారులో బయటికి వెళ్లాలనుకున్నప్పుడు ఏసీకి ప్రత్యామ్నాయంగా సహజసిద్దమైన ఆవుపేడను ఉపయోగించాలని అనుకున్నా. దీని ద్వారా ప్రకృతికి గానీ, ఏ ఇతర జీవులకు గానీ ఎలాంటి హాని ఉండదు. " -సేజల్ షా, కారు యజమాని