ETV Bharat / bharat

నమస్తే ట్రంప్: ఆ మూడు నగరాల్లో భద్రత కట్టుదిట్టం - అమెరికా అధ్యక్షుడు ఐటీసీ మౌర్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ పర్యటించే అహ్మదాబాద్, ఆగ్రా, దిల్లీల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. వేల మంది సిబ్బందిని మోహరించారు. యాంటీ డ్రోన్ వ్యవస్థ, యాంటీ స్నిప్పర్ టీంలను రంగంలోకి దించారు.

trump
ట్రంప్
author img

By

Published : Feb 22, 2020, 9:22 PM IST

Updated : Mar 2, 2020, 5:34 AM IST

నమస్తే ట్రంప్: ఆ మూడు నగరాల్లో భద్రత కట్టుదిట్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24 నుంచి భారత పర్యటన చేపట్టనున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడి పర్యటన కోసం భద్రతా పరంగా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ట్రంప్​ తొలుత పర్యటించనున్న గుజరాత్​లో రాష్ట్ర యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానితో కలిసి ట్రంప్ పాల్గొనే రోడ్​ షో కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రోడ్​ షో భద్రత కోసం 10 వేల మంది పోలీసులను నియమించారు. 25 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు నగరంలో భద్రతను పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద డ్రోన్లను ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విభాగానికి చెందిన 'యాంటీ స్నిప్పర్ టీం'ను సైతం రంగంలోకి దించనున్నారు.

మరోవైపు అహ్మదాబాద్​ నగరంలో భద్రత పెంచారు. నగరంలోని మోటేరా స్టేడియాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ పరిసరాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. స్టేడియంపై నుంచి హెలికాఫ్టర్​లో విహంగ వీక్షణం చేశాయి. నగర వీధుల్లో పోలీసు కాన్వాయ్​తో మాక్​ డ్రిల్ నిర్వహించాయి.

హోటళ్లు అప్రమత్తం..

నగరంలోని అన్ని హోటళ్లు రెస్టారెంట్లను అప్రమత్తం చేశారు పోలీసులు. పరిసర ప్రాంతాల్లో భద్రతను సమీక్షించుకోవాలని హోటళ్లకు సూచించారు. హోటళ్లలో దిగే కస్టమర్ల వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులతో పంచుకోవాలని ఆదేశించారు.

దిల్లీలోనూ కట్టుదిట్టం..

దేశరాజధాని దిల్లీలోనూ ట్రంప్​ పర్యటించనున్న నేపథ్యంలో రెండు వారాల నుంచి ఎన్​ఎస్​జీ కమాండోల బృందం భద్రత ఏర్పాట్లలో తలమునకలై ఉంది. పర్యటనలో భాగంగా ట్రంప్ సేదతీరే ఐటీసీ మౌర్య హోటల్​ వద్ద మూడంచెల భద్రత కల్పించారు. హోటల్​లో ఉన్న మొత్తం 438 గదులను బుకింగ్ చేసుకున్నారు. దిల్లీ పోలీసులు సైతం పరిసర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు. క్షేత్ర స్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. దేశ రాజధాని అంతటా దిల్లీ పోలీసులు, అమెరికా భద్రత దళాలతో పలు అంచెల భద్రత కల్పించనున్నారు.

ఆగ్రాలో 5వేల మంది

అధ్యక్షుడు ట్రంప్.. తాజ్​మహల్​ను సందర్శించనున్న నేపథ్యంలో ఆగ్రాలో భద్రత కట్టుదిట్టం చేసింది ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం. 5 వేల మంది భద్రత సిబ్బందిని మోహరించింది. ఒక్కో బృందంలో వంద మందితో కూడిన పది పారా మిలటరీ బృందాలను ఏర్పాటు చేసింది.

నగరం అంతటా సీసీటీవీ కెమెరాలను అమర్చారు అధికారులు. ఆగ్రాలో యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేసే విషయంపై చర్చిస్తున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 24న తాజ్​మహల్​ను సందర్శిస్తారు ట్రంప్. ఈ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలుకుతారు.

అమెరికా భద్రత

ట్రంప్ కోసం భారత దళాలే కాకుండా అమెరికా భద్రతా బలగాలూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. అధ్యక్షుడి భద్రత కోసం ఆయన ఉపయోగించే వాహనాలను భారత్​కు రప్పించాయి. ఈ మేరకు ఇప్పటికే నాలుగు కార్గో విమానాల్లో అవసరమైన సామాగ్రిని భారత్​కు తరలించాయి. అధ్యక్షుడి అధికారిక హెలికాఫ్టర్ 'మెరైన్ వన్', ఉపగ్రహాలతో సమాచారం పంచుకునే వ్యవస్థ అయిన 'రోడ్​ రన్నర్' భారత్​కు చేరుకున్నాయి. ట్రంప్ రోడ్​ షోలో పాల్గొనే సమయంలో భద్రతను పర్యవేక్షించడానికి భారీ ఎస్​యూవీ వాహనాన్ని సైతం సిద్ధం చేశారు.

Last Updated : Mar 2, 2020, 5:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.