భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బంగాల్లో చేపట్టిన రోడ్‌షోలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కోల్‌కతా వర్సిటీ సమీపంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా అమిత్‌షా వాహనశ్రేణిపై రాళ్లదాడి జరిగింది. కోపోద్రిక్తులైన భాజపా కార్యకర్తలు బిదాన్ సరనీ కళాశాల హాస్టల్‌ను గెరావ్ చేశారు. హాస్టల్ గేటుకు నిప్పు అంటించారు. ఈ ఘటనతో భాజపా, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి, పరస్పరం దాడులకు పాల్పడ్డారు. తక్షణం స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇదీ చూడండి: అయ్యర్ వ్యాఖ్యలపై మళ్లీ పెను దుమారం