కరోనా బారి నుంచి ఎందరినో రక్షిస్తున్న వైద్యులు... వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) కొరతతో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సార్లు పీపీఈలు ధరించినా.. వాటిపై అంటుకున్న వైరస్.. వైద్య బృందాలకే చుట్టుకుని ఉసురుతీసుకుంటోంది. అందుకే, డాక్టర్లను ఈ ప్రమాదం నుంచి తప్పించేందుకు పీపీఈలను సురక్షితంగా ఉపయోగించుకునేలా ఓ వస్త్ర పూత(పీపీఈ కోటింగ్)ను రూపొందించారు అమెరికా శాస్త్రవేత్తలు.
పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ బృందం.. రక్తం, లాలాజలం వంటి ద్రవాలను, ఉపరితలంపై ఉండే వైరస్, బ్యాక్టీరియాలను తిప్పికొట్టే వస్త్రపూతను సృష్టించింది. వైరస్‌ను తీసుకుని మరో చోట దాన్ని బలహీనం చేస్తుంది ఈ పీపీఈ కోటింగ్.
వస్త్రంతో తయారుచేసిన ఈ కోటింగ్‌ను ఎన్ని సార్లైనా ఉతికి తిరిగి ఉపయోగించవచ్చు.. ఫలితంగా వైద్య బృందాలకు వైరస్ సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ వస్త్రాన్ని ఎన్ని సార్లు ఉతికినా, రుద్దినా పాడవ్వనంత దృఢంగా రూపొందించారు.
అయితే, ఈ పీపీఈ కోటింగ్ పలు రకాల బ్యాక్టీరియాలపై ప్రయోగించగా అన్నింటినీ ఈ పూత జయించింది. కానీ కొవిడ్‌పై ఇంకా ప్రయోగాత్మకంగా పరీక్షించలేదు. కరోనా వైరస్‌ను తిప్పికొట్టగలిగితే, ఇది వైద్యసిబ్బందికే కాదు, సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరం.
ఇదీ చదవండి:'డాక్టర్ మామిడి'ని ఆరగిస్తారా? 'పోలీస్ మ్యాంగో' కావాలా?