ETV Bharat / bharat

అధునాతన సాంకేతికతతో అభ్యున్నతికి నిచ్చెన - National Technology Day

ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కోవడంలో మానవాళికి శాస్త్రసాంకేతికతలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి సరికొత్త డిజిటల్‌ లోకంలోకి ప్రపంచ గమనాన్ని వేగవంతం చేస్తోంది. నేడు జాతీయ సాంకేతికత దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవాళి జీవితంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనిద్దాం.

national technology day
అధునాతన సాంకేతికతతో.. అభ్యున్నతికి నిచ్చెన
author img

By

Published : May 11, 2020, 9:15 AM IST

భారత ప్రభుత్వం ఏటా నిర్వహించే జాతీయ సాంకేతికత దినోత్సవం దైనందిన జీవితాల్లో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాల పాత్రను తెలియజెప్పి విద్యార్థులను సైన్స్‌ టెక్నాలజీ కోర్సుల అధ్యయనానికి ప్రోత్సహిస్తోంది. 1998 మే 11న పోఖ్రాన్‌లో విజయవంతంగా జరిపిన అణ్వస్త్ర పరీక్షలకు గుర్తుగా ఏటా అదే రోజు జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్నాం. ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కోవడంలో మానవాళికి శాస్త్రసాంకేతికతలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి సరికొత్త డిజిటల్‌ లోకంలోకి ప్రపంచ గమనాన్ని వేగవంతం చేస్తోంది. ఆస్పత్రులు, జనసమ్మర్ద ప్రాంతాల్లో తలుపులను చేత్తో పట్టుకోకుండానే తెరవడానికి తోడ్పడే సాంకేతికత వచ్చేసింది. మన చేతితో ముఖాన్ని తాకబోతుంటే హెచ్చరించే మణికట్టు పట్టీల రూపకల్పనా చోటుచేసుకుంది.

మానవరహిత సేవలపై దృష్టి

డిజిటల్‌ చెల్లింపులు, టెలీ వైద్యం, ఆన్‌లైన్‌ విద్య, రోబోలు, డ్రోన్ల వినియోగం వంటి అధునాతన సాంకేతికతల వినియోగం విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి తోడ్పడే ఈ సాంకేతికతలు మన సామాజిక సంబంధాలను, వ్యాపార, ఉద్యోగ నిర్వహణ తీరును, వైద్య, వినోద సేవలను సమూలంగా మార్చేయబోతున్నాయి. కృత్రిమ మేధ(ఏఐ)ని ఉపయోగించి కొవిడ్‌కు మందులు కనుగొనడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కొవిడ్‌కు పాత మందులను వాడటానికి ఏయే మార్పులు చేయవచ్చో పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, పరిశోధనాలయాలు, వ్యాపార సంస్థలు కలసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కొత్త రీతులను అన్వేషిస్తున్నాయి. బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతలు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), 5జీ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం మానవ రహితంగా సాగుతున్న మన వృత్తి జీవితం కొవిడ్‌ తాకిడికి సమూల మార్పునకు లోనుకానుంది. మానవుల అవసరాన్ని బాగా తగ్గించడానికి రోబోలు, డ్రోన్లతో పనులు చేయించడం మొదలైంది. ఇప్పటికే ఆస్పత్రుల్లో క్వారంటైన్‌ ప్రదేశాలను రోబోలతో శుభ్రపరుస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్నవారికి రోబోలతోనే ఆహారం అందిస్తున్నారు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసి వస్తువులను, ఆహారాన్ని కొనుగోలు చేసినప్పుడు బట్వాడా కుర్రాళ్లు నేరుగా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. కరోనా భయంతో ఈ పద్ధతికి క్రమేణా స్వస్తి చెబుతున్నారు. నేడు ప్రపంచంలో ప్రధాన బట్వాడా కంపెనీలు మానవరహిత సేవలకు మళ్లుతున్నాయి. సరకులు తెచ్చి నిర్ణీత ప్రాంతంలో ఉంచితే, కొనుగోలుదారులు వాటిని భద్రంగా తీసుకెళుతున్నారు. బట్వాడా కుర్రాళ్ల నుంచి సరకులను తమ చేతుల్లోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. చైనాకు చెందిన ఈ-కామర్స్‌ సంస్థలు, రెస్టారెంట్లు ఇప్పటికే డ్రోన్లు, రోబోల ద్వారా సరకుల బట్వాడాకు మారుతున్నాయి. కరెన్సీ నోట్లను చేతులతో పట్టుకోవడంకన్నా మొబైల్‌, ఆన్‌లైన్‌లలో డిజిటల్‌ చెల్లింపులు జరపడానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు పెరుగుతున్నారు. అయితే బడుగు దేశాల్లో ఈ ధోరణి ఇప్పుడప్పుడే వ్యాపించకపోవచ్చు. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం అంతర్జాతీయంగా బ్యాంకు ఖాతాలు లేనివారు 170 కోట్లు. డిజిటల్‌ చెల్లింపులు జరపడానికి అవసరమైన అంతర్జాలం, కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు, నెట్‌ వర్కులు వీరికి అందుబాటులో ఉండకపోవడమే దీనికి మూల కారణం.

విస్తృతమవుతున్న'ఇంటి నుంచి పని'

కరోనా ఇంటి నుంచి పనిచేసే ధోరణిని విస్తృతం చేస్తోంది. ప్రభుత్వాలు, కంపెనీలు దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్కులు (వీపీఎన్‌), వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్స్‌ (వీఓఐపి), క్లౌడ్‌ టెక్నాలజీ, వర్చువల్‌ సమావేశాలు, ముఖ గుర్తింపు సాంకేతికతలు, బృందంగా పనిచేయడానికి తోడ్పడే టూల్స్‌ వల్ల ఇంటి నుంచి పని సుసాధ్యమవుతోంది. అనేక కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఇంటి నుంచి పనికి పెద్దయెత్తున మళ్లుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు ఉద్యోగులకు, సంస్థలకు పని విషయంలో చాలా వెసులుబాటు కలిగించే సాంకేతికతలు అందుబాటులో ఉండటం దీనికి ప్రధాన కారణం. ఈ సాంకేతికతల వల్ల సైబర్‌ భద్రతకు భంగం లేకుండా చూసుకోవాలి. కృత్రిమ మేధ, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ సాంకేతికతలను ఉపాధ్యాయులూ నేర్చుకోవలసి ఉంది. ఇతరత్రా కొత్త సాంకేతికతలు, వస్తువులూ అందుబాటులోకి వస్తున్నాయి. వైరస్‌ నిరోధక పూత పూసిన మాస్కులు, రోగులు శ్వాస తీసుకోవడానికి తోడ్పడుతూనే వైరస్‌ను కూడా చంపే వెంటిలేటర్లు రూపు దిద్దుకుంటున్నాయి. సినిమా, టీవీ వినోదం కూడా కొత్త పుంతలు తొక్కనుంది. కొవిడ్‌ తాకిడికి మూతపడిన అంతర్జాతీయ సరఫరా గొలుసులను తిరిగి పనిచేయించడంలో బ్లాక్‌ చెయిన్‌, బిగ్‌ డేటా, ఐఓటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతలు తోడ్పడతాయి. ఆస్పత్రుల్లో రద్దీ పెరిగితే కరోనా వైరస్‌ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తుంది కనుక రోగులు టెలీ వైద్యాన్ని ఆశ్రయించాలని వైద్యలోకం సూచిస్తోంది. జనాభా-వైద్యుల నిష్పత్తి బాగా తక్కువగా ఉండే పేద దేశాలకు ఇది ఎంతో అనుకూలించే అంశం. కరోనా పీడితులు ఎవరెవర్ని కలిశారో పసిగట్టి హెచ్చరించే ఆరోగ్యసేతు వంటి యాప్‌లు అనేక దేశాల్లో వాడుకలో ఉన్నాయి. ఇలా రకరకాల డిజిటల్‌ సాంకేతికతలు, సాధనాలు కొవిడ్‌పై పోరుకు తోడ్పడుతున్నాయి. కొవిడ్‌ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాదిమందికి డిజిటల్‌ సీమలో ఉద్యోగాలు లభించే రోజు రానుంది.

- పూతలపట్టు బాబ్జీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.