ETV Bharat / bharat

అహేతుక విధానాలతో నేటికీ గాడిన పడని 'బడి' - public school situation

నేడు ప్రతి రంగంలో మన ఆశలు ఆశయాలకు, వాస్తవ పరిస్థితికి మధ్య నింగికి నేలకూ ఉన్నంత తేడా ఉంది. విద్యారంగం దీనికి భిన్నంకాదు. ముఖ్యంగా మన పాఠశాలలను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. అయిదో తరగతి చదివే పిల్లల్లో సగంమంది రెండో తరగతి పాఠ్య పుస్తకం నుంచి ఒక పేరాను కూడా చదవలేకపోతున్నారని, ఒక గణిత ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోతున్నారని వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక (అసర్‌) ఏటా వాపోతూనే ఉంది. రాష్ట్ర పాఠశాల బోర్డు నుంచి గుర్తింపు పొందడానికి, ఫలానా ప్రదేశంలో పాఠశాల నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని ధ్రువీకరణ పత్రం పొందడానికీ భారీగా లంచం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులకు ముగింపు పలికేదెప్పుడు?

school situation very bad
నేటికీ గాడిన పడని బడి
author img

By

Published : Feb 26, 2020, 8:41 AM IST

Updated : Mar 2, 2020, 2:47 PM IST

నేడు ప్రతి రంగంలో మన ఆశలు ఆశయాలకు, వాస్తవ పరిస్థితికి మధ్య నింగికి నేలకూ ఉన్నంత తేడా ఉంది. విద్యారంగం దీనికి భిన్నంకాదు. ముఖ్యంగా మన పాఠశాలలను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. మన పిల్లలు స్వేచ్ఛగా ఆలోచిస్తూ ఆత్మగౌరవంతో జీవితంలో నిలదొక్కుకుంటూ నవీకరణ సాధకులుగా నిలవాలని గడచిన 70 ఏళ్లుగా మనం కలలుకంటూనే ఉన్నాం. కానీ, మన విద్యావ్యవస్థ ఆ కలలను కల్ల చేసింది. మన బాలలు, యువతలో స్వేచ్ఛా నవీకరణ స్ఫూర్తిని చంపేస్తోంది. పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఏటా ఆదుర్దా పడటం, వారి ఆశలకు తగిన విద్యాసంస్థలు కొరవడి చాలామంది హతాశులు కావడం చూస్తూనే ఉన్నాం. అయిదో తరగతి చదివే పిల్లల్లో సగంమంది రెండో తరగతి పాఠ్య పుస్తకం నుంచి ఒక పేరాను కూడా చదవలేకపోతున్నారని, ఒక గణిత ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోతున్నారని వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక (అసర్‌) ఏటా వాపోతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లోనైతే కనీసం 10 శాతం ఉపాధ్యాయులు కూడా అర్హత పరీక్షలు (టెట్‌)లో నెగ్గలేకపోతున్నారు.

సరైన అధ్యాపకులు లేరు...

ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో ప్రతి నలుగురు ఉపాధ్యాయుల్లో ముగ్గురు అయిదో తరగతి పాఠ్య పుస్తకంలోని గణిత ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. పఠనం, సైన్స్‌, అంక గణితాలపై ‘పీసా’ పరీక్షలో పాల్గొన్న 74 దేశాల పిల్లల్లో భారతీయ బాలలు 73వ స్థానంలో ఉన్నారంటే ఆశ్చర్యమేముంది? మనకన్నా వెనక 74వ స్థానంలో ఉన్నది కిర్గిజిస్థాన్‌. సరైన ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడం వల్లనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఖరీదైన ప్రైవేటు పాఠశాలలకు పంపక తప్పడం లేదు. 2011-2015 మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 1.1 కోట్ల మేరకు తగ్గిపోగా ప్రైవేటు పాఠశాలల్లో 1.6 కోట్ల మేరకు పెరిగిందని స్వయంగా ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. పెరిగిన గిరాకీని తీర్చాలంటే 2020లో అదనంగా 1.30 లక్షల ప్రైవేటు పాఠశాలలు ఏర్పడవలసి ఉంది. కానీ, అవి ఏర్పాటయ్యే అవకాశం కనిపించడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

ఒకటి- నిజాయతీపరులు పాఠశాలలను ఏర్పాటు చేయాలంటే అష్టకష్టాలు పడవలసిరావడం. చాలా రాష్ట్రాల్లో పాఠశాల స్థాపనకు ప్రభుత్వం నుంచి 30-45 అనుమతులు పొందవలసి ఉంటుంది. వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదేపదే ప్రదక్షిణలు చేయకతప్పదు. చేతులు తడపకా తప్పదు. రాష్ట్ర పాఠశాల బోర్డు నుంచి గుర్తింపు పొందడానికి, ఫలానా ప్రదేశంలో పాఠశాల నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని ధ్రువీకరణ పత్రం పొందడానికీ భారీగా లంచం ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రతిబంధకాలెన్నో...

ఇంకా పాఠశాల ఫీజులపై నియంత్రణ కూడా కొత్త ప్రైవేటు పాఠశాలల స్థాపనకు ప్రతిబంధకంగా ఉంది. విద్యాహక్కు చట్టంతో ఈ సమస్య మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల వైఫల్యాన్ని గమనించిన సర్కారు ప్రైవేటు పాఠశాలలు పేదలకు 25 శాతం సీట్లను ప్రత్యేకించాలని నిబంధన విధించింది. ఆలోచన మంచిదే కానీ ఆచరణే నాసిగా ఉంది. కారణం- పేదల రిజర్వుడు సీట్లకు అయ్యే ఖర్చుకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవడమే. ఈ ఖర్చును మిగతా 75 శాతం విద్యార్థులపై మోపుతున్నందువల్ల ఫీజులు పెరిగిపోతున్నాయి. దీనిపై తల్లిదండ్రుల నుంచి పెద్దయెత్తున నిరసన వ్యక్తం కావడం వల్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల ఫీజులపై నియంత్రణ విధిస్తున్నాయి. తాజాగా ప్రైవేటు పాఠశాలల పాఠ్యపుస్తకాలను నిషేధిస్తామనే హెచ్చరికలు పాఠశాలల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తున్నాయి.

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు

ప్రైవేటు పాఠశాలలూ ప్రభుత్వం ప్రచురించే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను వినియోగించాలని 2015లో కేంద్ర మానవ వనరుల శాఖ సూచించింది. సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఈ నిషేధాన్ని అమలు చేయడం వల్ల పుస్తకాల ఖర్చు తగ్గినా, ఆ పుస్తకాలు సకాలంలో అందవని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠ్యాంశాల నాణ్యత మీదా వారికి సందేహాలు ఉన్నాయి. 2015లో 10 రాష్ట్రాల్లో తాము సర్వే చేసిన స్కూళ్లలో సగానికి పాఠ్య పుస్తకాలు సకాలంలో రాలేదని ‘ఆక్స్‌ఫామ్‌’ సంస్థ తెలిపింది. క్రమంగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు మెరుగుపడినా, బట్టీ పద్ధతి యథాప్రకారం కొనసాగడం పెద్ద లోపం. భారతీయ విద్యార్థులు సులువుగా ధారాళంగా ఆంగ్లం మాట్లాడటానికి తోడ్పడే హలో ఇంగ్లిష్‌, గూగుల్‌ బోలో వంటి అద్భుతమైన యాప్స్‌ ఎన్నో ఉన్నాయనే సంగతీ మన ఉపాధ్యాయులకు తెలియదు. నేడు డిజిటల్‌ అభ్యసన సాధనాలెన్నో అందుబాటులోకి వచ్చాయి. వాటి సాయంతో ప్రపంచంలో అభ్యసన విప్లవం ముమ్మరమవుతోంది. దీన్ని మన పిల్లలు అందిపుచ్చుకోకపోతే ఈ విజ్ఞానాధారిత ప్రపంచంలో ఉపాధి అవకాశాలను కోల్పోతారు.

విద్యావిప్లవం రావాలి...

భారత్‌ గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 70 ఏళ్లయినా మన విద్యావిధానంలో కాలానుగుణమైన మార్పులు రాలేదని చెప్పాలి. మన పాఠశాలలకు స్వయంప్రతిపత్తి కల్పించడం ఎంతైనా అవసరం. 1991నాటి ఆర్థిక సంస్కరణలు పరిశ్రమలకు ఇచ్చిన స్వేచ్ఛను పాఠశాలలకు ఇవ్వలేదు. అవి ఇప్పటికీ లైసెన్సుల రాజ్యంలోనే మగ్గుతున్నాయి. అయినప్పటికీ భారత్‌ విజ్ఞానాధారిత సమాజంగా పురోగమించడంలో నాణ్యమైన ప్రైవేటు విద్యాసంస్థలు ప్రశంసనీయ పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్థల పూర్వ విద్యార్థులు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో, సివిల్‌ సర్వీసుల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. భారత్‌ను సాఫ్ట్‌వేర్‌ సామ్రాట్టుగా మలచడంలో వీరు గణనీయ పాత్ర పోషించారు.

ఉత్తమ బోధనను అందిస్తేనే...

ప్రైవేటు విద్యాసంస్థలు లాభాపేక్ష లేకుండా పనిచేయాలనే సామ్యవాద భావనకు ఇప్పుడు కాలం చెల్లిందని భారత్‌ గ్రహించాలి. లాభాలు ఆర్జించనిదే ఏ ప్రైవేటు సంస్థ అయినా మనుగడ నిలుపుకోలేదు. ఒక పాఠశాల ఉత్తమ బోధనను అందిస్తేనే రంగంలో నిలదొక్కుకొంటుంది. లాభాలు సంపాదిస్తుంది. ఆ డబ్బుతో నాణ్యత పెంచుకొంటుంది. పేరు తెచ్చుకొంటుంది. ఆ ఖ్యాతి వల్ల సదరు పాఠశాలకు గిరాకీ పెరుగుతుంది. దాన్ని తీర్చడానికి మరిన్ని చోట్లకు విస్తరిస్తుంది. ఇంతకన్నా వ్యాపార రహస్యం మరేమీ లేదు. విద్యారంగాన్ని లాభాపేక్ష లేని రంగంగా వర్గీకరించడం మాని లాభదాయక రంగంగా పరిగణించడం మొదలుపెడితే నిజమైన విద్యావిప్లవం వస్తుంది. విద్యారంగంలోకి కొత్త పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడతాయి. విద్యార్థులు ఎంచుకోవడానికి ఎన్నెన్నో విద్యాసంస్థలు, నాణ్యమైన బోధన-అభ్యసన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

ఉత్తమ విద్యకూ పారితోషికం చెల్లించడానికి సై

ఎంపిక, పోటీలకు ఉన్న విలువేమిటో భారతీయ పౌరులకు తెలుసు. మన పౌరులు నీరు, విద్యుచ్ఛక్తులకు రుసుములు చెల్లిస్తున్నారు. అలాగే ఉత్తమ విద్యకూ పారితోషికం చెల్లించడానికి సై అంటున్నారు. చక్కటి పాఠశాల, మంచి పాఠ్య పుస్తకం కోరుకునే స్వేచ్ఛను, హక్కును పౌరులకు ఎందుకు నిరాకరించాలి? కాబట్టి, ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలను అతిగా నియంత్రించాలని చూడకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచాలి. మొదట విద్యారంగాన్ని నియంత్రించేటప్పుడు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలకు సమానమైన ప్రమాణాలను విధించాలి. రెండు- ప్రభుత్వ పాఠశాలలను సమర్థంగా నిర్వహించాలి. ప్రభుత్వం ఈ రెండు లక్ష్యాలకు తక్షణ ప్రాధాన్యమివ్వాలి.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేర్వేరు

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేర్వేరు అన్నట్లు చూస్తున్నారు. అవి పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో పనిచేస్తున్నట్లు పరిగణిస్తున్నారు. దీనివల్ల అధికారులు, పాఠశాల నిర్వాహకుల్లో అయోమయం ఏర్పడి, లోపభూయిష్ఠ విధానాలకు దారితీస్తోంది. ఇకనైనా ప్రైవేటు విద్యా సంస్థలకు తగు స్వేచ్ఛనివ్వాలి. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను మెరుగుపరచాలి. చక్కని పాఠశాలల్లో తమ బిడ్డలకు ప్రవేశం కోసం బారులు తీరాల్సిన అగత్యాన్ని తల్లిదండ్రులకు తప్పించాలి. వారి ఆశలను తీర్చే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తీర్చిదిద్దాలి. భవిష్యత్తులో భారత సందర్శనకు వచ్చే అమెరికా అధ్యక్షులు మన విద్యా విధానం అత్యుత్తమమైనదని ప్రశంసించే స్థాయికి మనం ఎదగాలి.

ఇప్పటికీ ‘ఏకీకృత’మే!...

school situation very bad
నేటికీ గాడిన పడని బడి

ఇక్కడ సాటి ఆసియా దేశాల అనుభవాలను పరిశీలించాలి. 1980వ దశకం చివర్లోనే చైనా జాతీయ పాఠ్యపుస్తక విధానానికి స్వస్తి చెప్పింది. మనమేమో ఇప్పటికీ ఏకీకృత పాఠ్యపుస్తక విధానాన్ని అనుసరించాలని చూస్తున్నాం. చైనా బహుళ స్థానిక పాఠ్య పుస్తకాల విధానానికి మారింది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే అనుభవాలకు విద్యార్థిని పాఠశాల నుంచే సన్నద్ధం చేయడం ఈ విధాన లక్ష్యం. తరగతి గది నుంచి వాస్తవ ప్రపంచంలోకి దూకి నెగ్గుకొచ్చేలా బాలలను తయారుచేయడానికి ఈ విధానం అంకితమవుతోంది. ఆసియాలో శీఘ్ర అభివృద్ధి సాధించిన సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సమర్థమైన విద్యావిధానం ఉంది. ఆ విధానమూ జాతీయ ఏకీకృత పాఠ్యపుస్తకాల నుంచి బహుళ పాఠ్యగ్రంథాలకు మారింది. ‘

నూతన విధానమే మేలు...

ఒకే పాఠ్యగ్రంథం-ఒకే పరీక్ష’ పద్ధతి నుంచి కొత్త విధానానికి మారడం వల్ల విద్యార్థుల పనితీరు ఎంతో మెరుగుపడింది. వారు మెరుగైన ఫలితాలు సాధించగలిగారు. ఆసియా దేశాల ఉపాధ్యాయులకు నేడు విభిన్న బోధన సామగ్రి అందుబాటులో ఉన్నందువల్ల వాటిని ఉపయోగించి విద్యార్థులు- ఉపాధ్యాయులు పరస్పరాశ్రిత (ఇంటరాక్టివ్‌) బోధన-అభ్యసనాలను చేపడుతున్నారు. విద్యార్థుల్లో తార్కిక విశ్లేషణ, సమస్యా పరిష్కార శక్తులను పెంపొందించగలుగుతున్నారు. తద్వారా వారిని నవకల్పనల సాధకులుగా తీర్చిదిద్దగలుగుతున్నారు. ఈ దేశాల నుంచి మనం నేర్చుకుని ఆచరించవలసింది ఎంతో ఉంది.

పుస్తకాలు అరువు...

ఆ దేశాల్లో విద్యార్థులు అన్ని పాఠ్య గ్రంథాలను కొనుగోలు చేయనక్కర్లేదు. వారికి పుస్తకాలను అరువు ఇస్తారు. వాటిని పదేపదే ఉపయోగించుకోవచ్చు. పాఠ్య గ్రంథాల్లోని అంశాలను నిరంతరం ఆధునికీకరించడం, మారుతున్న కాలానికి అనుగుణమైన మార్పుచేర్పులను పొందుపరచడం. పాఠ్య ప్రణాళికల్లో ఎప్పటికప్పుడు సవరణలు చేయడం, ఉపాధ్యాయ శిక్షణకు కావలసిన సామగ్రిని అందజేయడం వంటివి కొన్ని ఆసియా దేశాల్లో నిరంతరం సాగే ప్రక్రియ. ఆ దేశాల ప్రభుత్వాలు పుస్తక ప్రచురణకర్తలతో నిరంతరం సంప్రతింపులు జరుపుతూ తమకు కావలసినది నెరవేర్చుకుంటాయి.

-గురుచరణ్​ దాస్​ (రచయిత- ప్రజావ్యవహారాల అధ్యయనకర్త, ప్రోర్టర్​ అండ్​ గ్యాంబుల్​ మాజీ సీఈఓ)

Last Updated : Mar 2, 2020, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.