ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు సంబంధించిన ఈడీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 5వ ఆదేశాలు జారీ చేయనున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. చిదంబరానికి గురువారం వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది జస్టిస్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం.
నివేదికలు, విచారణ పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఈడీని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరం సోమవారం వరకు కస్టడీలోనే ఉండనున్నారు. రిమాండ్ పొడిగింపు సీబీఐ కోర్టు మాత్రమే చేయగలదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పడం వల్ల ఈ అంశంపై స్పందించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇదీ చూడండి:- కశ్మీర్ విభజన, అభివృద్ధిపై కేంద్రం ముమ్మర కసరత్తు