తమకు విధించిన మరణ శిక్షపై స్టే విధించాలని కోరుతూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లపై ఈ నెల 14న సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.... ఈనెల 14న మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు ఈ వ్యాజ్యాలపై విచారణ చేపడుతుంది.
ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణతో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నారిమన్, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ ఉన్నారు. నిర్భయ దోషుల్లో వినయ్ కుమార్ శర్మ, ముకేశ్ కుమార్లు తమకు విధించిన ఉరిశిక్షను నిలిపేయాలంటూ క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయపరంగా తమకు ఉన్న చివరి అవకాశాన్ని వినియోగించుకున్నారు.
నిర్భయ దోషులకు విధించిన మరణశిక్షను ఈనెల 22న ఉదయం ఏడింటికి అమలు చేయాలంటూ ఇటీవలే దిల్లీ పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఈనెల 22న ఉరి