ఒకే కేసుకు సంబంధించి ఒకరికంటే ఎక్కువ మందికి ఉరిశిక్ష పడి ఉంటే.. వారిని వేర్వేరుగా ఉరి తీసేందుకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను పరిశీలిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు. నిర్భయ దోషులందరికీ ఒకేసారి ఉరిశిక్ష వేయాలని ఫిబ్రవరి 5న దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. కేంద్రంతో పాటు దిల్లీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
తాజాగా ఈనెల 20న నిర్భయ దోషులకు డెత్ వారెంట్ ఇచ్చింది దిల్లీ కోర్టు. అయితే కేంద్రం, దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 23న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
'దోషులను వేర్వేరుగా ఉరి తీయొచ్చా లేక అందరికీ ఒకేసారి మరణశిక్ష అమలు చేయాలా? అన్నదే ఇక్కడ ప్రశ్న. దీనిని మేము పరిశీలిస్తాం.'
- సుప్రీంకోర్టు
ఇదీ చదవండి: ప్రధాని నరేంద్రమోదీ రక్షణకు అమెరికాతో భారీ ఒప్పందం