ఆర్థికంగా వెనుకబడిన వర్గాల 10 శాతం కోటాను... కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్)లో అమలు చేయడంపై సీబీఎస్ఈ స్పందన కోరింది సుప్రీం కోర్టు. సీటెట్-2019 రాయబోతున్న అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించింది జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. జులై 1న తదుపరి విచారణ ఉంటుందని, ఆ లోపు వివరాలు సమర్పించాలని సీబీఎస్ఈని ఆదేశించింది.
2019 జనవరిలో విడుదల చేసిన సీటెట్ నోటిఫికేషన్ ప్రకటనలో... 10 శాతం కోటా అమలు చేయట్లేదని సీబీఎస్ఈ తెలిపినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రుతుపవనాలు 5 రోజులు ఆలస్యం: ఐఎండీ