పీఎం కేర్స్ ద్వాారా సేకరించిన నిధులను జాతీయ విపత్తు నిర్వహణ నిధి(ఎన్డీఆర్ఎఫ్)కి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారించింది సుప్రీంకోర్టు. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో పెట్టింది.
పీఎం కేర్స్ నిధి ద్వారా సేకరించిన విరాళాలు స్వచ్ఛంద నిధుల కిందకు వస్తాయని.. ఎన్డీఆర్ఎఫ్కు నిధులు బడ్జెట్ ద్వారా సమకూర్చుతారని వాదనల సందర్భంగా కోర్టుకు తెలిపారు కేంద్రం తరఫు న్యాయవాది తుషార్ మెహ్తా.
అయితే పీఎం కేర్స్ నిధిని విపత్తు నిర్వహణ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని ఎన్జీఓ తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే. ఎన్డీఆర్ఎఫ్ ఆడిట్‌ను కాగ్ నిర్వహిస్తుందని, పీఎం కేర్స్ నిధి ఆడిట్‌ను మాత్రం ప్రైవేటు ఆడిటర్లు నిర్వహిస్తారని ప్రభుత్వం చెప్పినట్లు కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.