ETV Bharat / bharat

'నీట్​ రద్దు' వ్యాజ్యాలపై విచారణకు సుప్రీం నో - నీట్​ పరీక్ష 2020

నీట్​ పరీక్ష వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఈ విషయంలో తీర్పు ఇచ్చామని, పరీక్షల నిర్వహణకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని పిటిషన్​దారులకు స్పష్టం చేసింది.

SC-NEET
నీట్
author img

By

Published : Sep 9, 2020, 1:57 PM IST

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్​) రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ల స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్​ అశోక్​ భూషణ్​ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

"కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని భద్రతా చర్యలను అధికారులు తీసుకుంటారు. ఇప్పుడు అంతా అయిపోయింది. సమీక్ష కోసం వచ్చిన పిటిషన్లు కూడా కొట్టివేశాం. ఇప్పటికే జేఈఈ పరీక్షలు నిర్వహించారు. క్షమించాలి.. ఈ పిటిషన్లను స్వీకరించేందుకు సిద్ధంగా లేము."

- సుప్రీంకోర్టు

పిటిషన్​దారుల తరఫు న్యాయవాదులు పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కంటైన్మెంట్​ జోన్లలో ఉన్న విద్యార్థుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యాజ్యాల కొట్టివేత..

ఇప్పటికే.. నీట్​, జేఈఈ పరీక్షలపై ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్లను సెప్టెంబర్​ 4న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇందులో ఆరు రాష్ట్రాల మంత్రుల దాఖలు చేసిన పిటిషన్​ కూడా ఉంది.

సెప్టెంబర్​ 13న పరీక్ష..

ఇంజినీరింగ్​లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ ఇప్పటికే పూర్తి కాగా.. నీట్​ సెప్టెంబర్​ 13న జరగనుంది.

ఇదీ చూడండి: 'నీట్​' నిర్వహణకు ఎన్​టీఏ కసరత్తులు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.