ETV Bharat / bharat

వర్సిటీల్లో కుల వివక్షపై కేంద్రానికి సుప్రీం నోటీసులు - సుప్రీం కోర్టు

వర్సిటీల్లో కుల వివక్షను నిషేధించాలని కోరుతూ.. రోహిత్​ వేముల, పాయల్​ తద్వి తల్లులు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. వాదనలు విన్న జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్​పై నాలుగువారాల్లో సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వర్సిటీల్లో కుల వివక్షపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
author img

By

Published : Sep 20, 2019, 12:29 PM IST

Updated : Oct 1, 2019, 7:48 AM IST

విశ్వవిద్యాలయాల్లో కులవివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న రోహిత్​ వేముల, పాయల్​ తద్వి తల్లులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఇలాంటి చర్యలను రూపుమాపాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సమానత్వ హక్కు, కుల వివక్షను నిషేధించే హక్కు, జీవించే హక్కును అమలు చేయాలని కోరారు.

న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ అజయ్​ రస్తోగిల ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే యూజీసీ నియంత్రణలు ఉన్నాయని తెలిపింది ధర్మాసనం. అయితే అవి అమలు కావడం లేదని పిటిషనర్​ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్​ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రోహిత్​ వేముల, పాయల్​ తద్వి ఆత్మహత్య ఘటనలను కోర్టుకు వివరించారు. పిటిషన్​పై నాలుగు వారాల్లో సమాధానమివ్వాలని కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.

2016 జనవరి 17న హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా పీహెచ్​డీ చేస్తోన్న రోహిత్​ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది మే 22న తమిళనాడులోని తోపివాలా జాతీయ వైద్య కళాశాలలో ఇదే కారణంతో పాయల్​ తద్వి బలవన్మరణానికి పాల్పడింది.

ఇదీ చూడండి: లైంగిక వేధింపుల ఆరోపణలతో చిన్మయానంద్​ అరెస్టు

New Delhi, Sep 20 (ANI): Congress leader P.L. Punia on Sep 20 said the incident at West Bengal's Jadavpur University where Minister of State for Environment, Forest and Climate Change Babul Supriyo was heckled, is a matter of concern, although added that the BJP is always rakes up issues which create chaos in the state. Punia further said Supriyo, a union minister, should have informed authorities before visiting the university to avoid such incidents.
Last Updated : Oct 1, 2019, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.