కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్, స్మృతి ఇరానీలు పరస్పరం వేసుకున్న పరువునష్టం దావా కేసులపై స్పందించాలని స్మృతిని ఆదేశించింది.
ఓ కేసులో కాంగ్రెస్ నేత నిరుపమ్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై స్మృతి ఇరానీకి జారీ అయిన సమన్లను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో తనపై జారీ అయిన సమన్లను కొట్టివేయాలన్న నిరుపమ్ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. నిరుపమ్పై దాఖలైన కేసు కొనసాగుతుందని గత ఏడాది డిసెంబర్ 19న స్పష్టం చేసింది.
తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నిరుపమ్ పిటిషన్పై విచారణ చేపట్టింది. నిరుపమ్ రెండు పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీం సోమవారం స్మృతికి స్పందించాలని నోటీసులు జారీ చేసింది.