పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కిరణ్ బేడీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కె. లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ రోజువారీ పాలనా కార్యకలాపాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోరాదన్న మద్రాసు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు కిరణ్ బేడీ.
ఈ పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
సమస్య ఏమిటీ?
పుదుచ్చేరికి కిరణ్ బేడీ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్కడి ప్రభుత్వానికి, ఆమెకు మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాల్లో ఎల్జీ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు.
కిరణ్ బేడీ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కె. లక్ష్మీనారాయణ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పిటిషన్పై ఏప్రిల్ 30న విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.మహదేవన్ ప్రభుత్వ పాలనా కార్యకలాపాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోరాదని తీర్పు వెలువరించారు.
ఇదీ చూడండి: 'అయోధ్య'పై మధ్యవర్తిత్వం గడువు పెంపు