మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది. పుణెకు చెందిన ముస్లిం దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
కేంద్రానికి నోటీసులు
వ్యాజ్యంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ వక్ఫ్ బోర్డు, జాతీయ మహిళా కమిషన్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రపంచంలో ఇంకెక్కడైనా మసీదుల్లోకి మహిళలను ప్రార్థనలకు అనుమతిస్తున్నారా అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
కెనడా, సౌదీ అరేబియా సహా కొన్నిచోట్ల అనుమతి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. మహిళలను అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, మహిళా హక్కులకు భంగమని వాదించారు.
శబరిమల తీర్పే కారణం
శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించినట్లు ధర్మాసనం పేర్కొంది.
- ఇదీ చూడండి: ప్రధాని మోదీకి ప్రభుత్వాధికారి లేఖాస్త్రం