ETV Bharat / bharat

లాక్​డౌన్​లో 593 కేసుల విచారణ- 215 తీర్పులు - కరోనా వైరస్​ ఇండియా

సాధారణంగా ఒక నెలలో 3వేలకుపైగా కేసులను విచారించే సుప్రీంకోర్టు లాక్​డౌన్​ నేపథ్యంలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. మార్చి 23 నుంచి ఏప్రిల్​ 24వరకు కేవలం 593 కేసులను విచారించగా.. 215 తీర్పులిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.

SC heard 593 matters, delivered verdicts in 215 cases during COVID-19 lockdown
లాక్​డౌన్​లో 593 కేసుల విచారణ- 215 తీర్పులు
author img

By

Published : Apr 26, 2020, 5:55 PM IST

కరోనాపై పోరులో భాగంగా దేశం లాక్​డౌన్​లోకి వెళ్లిపోయినప్పటి నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే కేసుల విచారణ చేపడుతోంది సుప్రీం కోర్టు. లాక్​డౌన్​ నెల రోజుల వ్యవధిలో 593 కేసులను విచారించిన సుప్రీం 215 తీర్పులుచ్చింది.

తొలి దశ లాక్​డౌన్​కు రెండు రోజుల(మార్చి 23) ముందే కోర్టులోకి పిటిషనర్లు, న్యాయవాదులకు అనుమతిని నిరాకరించింది అత్యున్నత న్యాయస్థానం. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అత్యవసర కేసులను మాత్రమే విచారించనున్నట్టు స్పష్టం చేసింది.

మార్చి 23- ఏప్రిల్​ 24 వరకు ఇలా...

  • 87 ధర్మాసనాలు మొత్తం 593కేసులను విచారించాయి.
  • 84 రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది.
  • 87 ధర్మాసనాలు 34 కొత్త కేసులను విచారించగా... 53 రివ్యూ పిటిషన్లు పరిశీలించాయి.
  • వీటిలో 390 ముఖ్య కేసులు, 203 అనుబంధ కేసులున్నాయి.

వీసీ ద్వారా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 100ఎం​బీపీఎస్​ హైస్పీడ్​ ఇంటర్నెట్​ కనెక్షన్​ అందించినట్టు సమాచారం.

ఇదీ చూడండి:- ఒకప్పుడు కాలుష్య కేంద్రాలు- ఇప్పుడు గ్రీన్​ జోన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.