పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ ప్రాంతాలను లోక్‌సభ స్థానాలుగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
నిఘా విభాగం 'రా' మాజీ అధికారి రామ్ కుమార్ యాదవ్ వేసిన వ్యాజ్యాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ పిటిషన్ చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాదంటూ కొట్టివేసింది. పిటిషనర్‌కు రూ.50వేలు జరిమానా విధించింది.
ఇదీ చూడండి: అమర్‌నాథుని దర్శనానికై కదిలిన భక్తజనం