ETV Bharat / bharat

ఆ మురికివాడల్లోని 48వేల నివాసాల తొలగింపు! - ఈపీసీఏ

దేశ రాజధాని దిల్లీలో 140కిలోమీటర్ల మేర రైల్వే పట్టాలను ఆనుకుని ఉన్న 48వేల మురికివాడ నివాసాలను మూడు నెలల్లో తొలగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రైల్వే లైన్లపై పేరుకుపోయిన వ్యర్థాలు, వాటిని ఆనుకుని ప్రమాదకర రీతిలో నిర్మించిన నివాసాలు అత్యంత దయనీయ స్థితిలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో రాజకీయంగా ఎవరూ జోక్యం చేసుకోకూడదని, ఏ కోర్టు కూడా స్టే విధించకూడదని స్పష్టం చేసింది.

SC directs removal of 48,000 slums along rail tracks in Delhi in three months
ఆ 48వేల మురికివాడ నివాసాల తొలగింపునకు సుప్రీం ఆదేశం
author img

By

Published : Sep 3, 2020, 3:22 PM IST

దిల్లీ రైల్వే పట్టాలను ఆనుకుని 140 కిలోమీటర్ల మేర ఉన్న 48 వేల మురికివాడ నివాసాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మూడు నెలల గడువునిచ్చింది. ఈ విషయంలో రాజకీయ పరంగా ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

మురికివాడల్లోని నివాసాల తొలగింపునకు అడ్డుకునే విధంగా ఏ కోర్టు కూడా స్టే విధించకూడదని తన తీర్పులో పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. ఒకవేళ స్టే విధించినా.. అది పనిచేయదని తేల్చి చెప్పింది.

ఈపీసీఏ(పర్యావరణ కాలుష్య నిరోధక నియంత్రణ ప్రాధికార సంస్థ) దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ మేరకు ఆదేశాలిచ్చింది జస్టిస్​ అరుణ్​ మిశ్రా, జస్టిస్​ బీఆర్​ గవాయ్​, జస్టిస్​ కృష్ణ మురారి ధర్మాసనం. ఆ ప్రాంతంలోని వ్యర్థాలు, నివాసాలను తొలగించడంపై నెల రోజుల్లో నివేదికను సమర్పించాలని తెలిపింది.

మురికివాడల్లోని నివాసాల తొలగింపునకు అవసరమైన ఖర్చులో 70శాతం రైల్వే, మిగిలిన 30శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. పనుల కోసం అవసరమైన మానవ వనరులను దక్షిణ దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​(సీడీఎమ్​సీ), రైల్వే, సంబంధిత సంస్థలు అందిస్తాయని పేర్కొంది.

దయనీయ స్థితిలో...

దిల్లీ రైల్వే ట్రాక్​ వద్ద పెరిగిపోతున్న మురికివాడలు, వ్యర్థాలపై గత కొంత కాలంగా రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లైన్​కు అతి సమీపంగా ఈ మురికివాడలు ఉంటున్నాయని పేర్కొన్నారు. వీటిని తొలగించడానికి 2018లోనే ఎస్​టీఎఫ్​(స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​)ను కూడా నియమించారు. కానీ అనేక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పని ముందుకు కదలలేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో రైల్వే పేర్కొంది.

దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. వాస్తవాలను పరిశీలించింది. పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. యుద్ధపాత్రిపదికన చర్యలు చేపట్టి.. రైల్వే లైన్లపై వ్యర్థాలు పారేయకుండా చూసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి:- ప్రశాంత్​ భూషణ్​కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.