కాంగ్రెస్ ఎంపీ సుశ్మితా దేవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారాల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దేవ్ పిటిషన్ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. రేపు వాదనలు విననున్నట్లు తెలిపింది. సుశ్మితా దేవ్ తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదించనున్నారు.
మోదీ, షాపై ఫిర్యాదు చేసినా.. ఈసీ సరిగా స్పందించట్లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు.
ఇదీ చూడండి: