భాజపా పార్లమెంటు సభ్యురాలు సావిత్రిబాయి పూలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, యూపీ పశ్చిమ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాధిత్య సింధియా సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు.
2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని బహరైచ్ లోక్సక్ సభ స్థానానికి భాజపా తరపున పోటీ చేసి గెలుపొందారు సావిత్రిబాయి.
" దేశ రాజ్యాంగాన్ని సంరక్షించుకునేందుకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. భాజపాను ఆపగలిగేది కాంగ్రెస్ మాత్రమే. " -- సావిత్రి బాయి
గతేడాది డిసెంబర్ 6నే సావిత్రి భాజపాకు రాజీనామా చేశారు. సమాజంలో చీలిక తెస్తున్నారని, రిజర్వేషన్లపై సరిగా స్పందించడం లేదని భాజపాపై నిరసన వ్యక్తం చేశారు.
బీఎస్పీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన సావిత్రి... భాజపాలో చేరి 2014లో ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు.