ETV Bharat / bharat

ముందస్తు విడుదలకు శశికళ అభ్యర్థన - జైలు నుంచి శశికళ విడుదల

అనుకున్న సమయానికన్నా ముందుగానే శశికళ జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జనవరి 27న శశికళ విడుదలయ్యే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. అయితే అంతకుముందే తనను విడుదల చేయాలని జైలు అధికారులను శశికళ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Sasikala applies for remission and early release from prison
ముందస్తు విడుదలకు శశికళ అభ్యర్థన
author img

By

Published : Dec 2, 2020, 3:37 PM IST

అక్రమార్జన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ.. తనను ముందస్తుగా విడుదల చేయాలని అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే ప్రత్యేక కోర్టుకు రూ. 10 కోట్ల జరిమానా చెల్లించారు శశికళ. వచ్చే ఏడాది జనవరి 27న ఆమె విడుదలయ్యే అవకాశం ఉందని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు.

అయితే అంతకుముందే తనను విడుదల చేయాలని కోరినట్లు శశికళ సన్నిహిత వర్గాలు తెలిపాయి. శశికళ అభ్యర్థనను జైలు శాఖ వర్గాలు ఉన్నతాధికారులకు పంపించినట్లు వెల్లడించాయి. ఈ విన్నపంపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశాయి.

జైలు నిబంధనల ప్రకారం కారాగారంలో సత్ప్రవర్తనతో మెలిగితే.. శిక్షలో ప్రతి నెల మూడు రోజుల మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రకారం శశికళకు విధించిన శిక్షలో 135 రోజులు తగ్గే అవకాశం ఉంటుంది.

నాలుగేళ్ల శిక్ష..

అక్రమార్జన కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ కేసులో శశికళతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉన్నారు. ఇందులో జయలలితకు రూ.100 కోట్లు, శశికళ సహా మరో ఇద్దరికి రూ.10 కోట్ల చొప్పున జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్​లో ట్రయల్​ కోర్టు తీర్పునిచ్చింది. జయలలిత మరణంతో ఆమెపై ఉన్న అప్పీలు రద్దైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.