జమ్ముకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తెలిపింది. పాక్ వాయుసేన కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా జవాబిస్తామని స్పష్టం చేసింది. పశ్చిమ భారత్లోని ఐఏఎఫ్ శిబిరాలన్నింటికీ హై అలర్ట్ హెచ్చరికలు జారీ చేశామని ప్రకటించింది.
పునఃప్రారంభం కాని విమానసేవలు...
ఒమన్, ఇరాన్, అఫ్గానిస్థాన్, చైనా దేశాలకు విమాన సేవలనుపాక్పునరుద్ధరించింది. భారత్-పాక్ సరిహద్దులోని 11 విమానాశ్రయాల్లో సేవలు మాత్రం ఇప్పటికీ పునఃప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు.