ETV Bharat / bharat

అమ్మో..! ఆ సిలిండర్​లో ఏముందో తెలుసా..?

బంగాల్​లోని ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఇంట్లోకి వంట గ్యాస్​ బుక్​ చేసుకున్న ఆ వ్యక్తి సిలిండర్​లో ఊహించని దాన్ని చూసి కంగుతిన్నాడు. ఇంతకీ అందులో ఏముందో తెలుసా!

author img

By

Published : Apr 19, 2020, 6:08 PM IST

Sand in LPG cylinder
అమ్మో..! ఆ సిలిండర్​లో ఏముందో తెలుసా..

ఉత్తర బంగాల్​ జల్పాయిగురి జిల్లాకు చెందిన ఓ లబ్ధిదారుడు పీఎం ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకం కింద వంట గ్యాస్​ను బుక్​ చేసుకున్నాడు. సిలిండర్ రాగానే ఇక చకచకా వంట చేసుకోవచ్చు అనుకున్న ఆ వ్యక్తి గ్యాస్​ స్థానంలో ఇసుక చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు.

అసలేం జరిగిందంటే!

జల్పాయిగురి జిల్లాలోని కాయెట్​గోచ్​ గ్రామానికి చెందిన రమేశ్​ రాయ్​ 12 రోజుల క్రితం పీఎంయూవై పథకం కింద ఎల్​పీజీ సిలిండర్​ను పొందాడు. అయితే శుక్రవారం నుంచి గ్యాస్​ వెలగడం లేదు. పైగా సిలిండర్​ బరువుగా ఉండడం వల్ల ఏం అయిందో అర్థంకాక కంగారు పడ్డాడు రమేశ్​. ఎన్ని సార్లు ప్రయత్నించినా స్టవ్​ వెలగకపోవడం వల్ల పొరుగింటి వారిని పిలిచారు. అనుమానంతో చూసే సరికి అందులో ఇసుక ఉన్నట్లు గమనించి షాక్​కు గురయ్యాడు.

Sand in LPG cylinder
అమ్మో..! ఆ సిలిండర్​లో ఏముందో తెలుసా..

" సిలిండర్ నిండుగా, బరువుగా ఉంది. పైగా నేను గ్యాస్​ సిలిండర్ పొంది 12 రోజులే అవుతోంది. అనుమానం వచ్చి బరువు చూడగా 21 కేజీలు ఉంది. అయినా స్టవ్​ వెలగలేదు. చివరిగా సిలిండర్​ మూత తీసి వంచగా అందులో నుంచి సుమారు 6 కేజీల ఇసుక బయటకు వచ్చింది. అందరం షాక్​కు గురయ్యాం. వెంటనే పంపిణీదారుడికి సమాచారం ఇచ్చా."

-- రమేశ్​ రాయ్​

మాకు సంబంధం లేదు

సిలిండర్​లోకి ఇసుక ఎలా వచ్చిందో తమకు తెలియదన్నారు పంపిణీదారుడు. ఈ విషయమై దర్యాప్తు చేస్తామని తెలిపాడు. ఎల్​పీజీ సిలిండర్లను ఇంటింటికీ అందించడమే తమ పని అని చెప్పుకొచ్చాడు.

అమ్మో..! ఆ సిలిండర్​లో ఏముందో తెలుసా..

ఇదీ చదవండి: నిండు చూలాలు.. వందల కిలోమీటర్ల నడక ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.