ఆహారంలో అధికంగా ఉప్పుని తీసుకోవడం వలన అధిక రక్తపోటు సమస్య ఉత్పన్నమౌతుందని, అధిక రక్త పోటే ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఓ అధ్యయనంలో తేలింది. బ్రిటీష్ మెడికల్ జర్నల్ తాజాగా విడుదల చేసిన అధ్యయన
నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 'ఆహారంలో ఉప్పు ప్రభావం' అనే అంశంపై 133 మందిపై పరిశోధనలు జరిపారు. మనం ఆహారంలో ఉపయోగించే ఉప్పుని శాస్త్రీయంగా సోడియం క్లోరైడ్ గా వ్యవహరిస్తారు.
ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం వలన శరీరంలో సోడియం నిక్షేపాలు పేరుకు పోతాయి. ఆహారం ద్వారా శరీరంలో చేరుకునే సోడియానికి రక్త పోటుకు ప్రత్యక్ష సంబంధముందని అధ్యయనంలో తేలింది.
శరీరంలో సోడియాన్ని తగ్గిస్తే రక్తపోటుని నివారించవచ్చన్నదే అధ్యయనం ముఖ్యలక్ష్యమని న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు తెలిపారు.
ఇదీ చూడండి: నూడుల్స్‌తోనే ఆకలి తీర్చుకుంటున్న దిల్లీ వాసులు!