ముంబయి ఉగ్రదాడిలో అమరుడైన హేమంత్ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పారు భోపాల్ లోక్‌సభ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞ సింగ్ ఠాకుర్. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శత్రువులకు అవకాశం ఇవ్వొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.
"శత్రువులకు మనోబలాన్ని ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది దేశ అంతర్గత విషయం. నా వ్యక్తిగత వ్యధ.. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. క్షమాపణలు చెబుతున్నా. శత్రుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదుల తూటాలకు మన అధికారి ప్రాణాలు విడిచారు. ఆయన కచ్చితంగా అమరుడే."
-సాధ్వి ప్రజ్ఞ సింగ్ ఠాకూర్
మోదీ క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్..
సాధ్వీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి విపక్షాలు. ఈ అంశంలో ప్రధాని మోదీ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్.
-
Hemant Karkare gave his life protecting India. He must be treated with respect.
— Rahul Gandhi (@RahulGandhi) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hemant Karkare gave his life protecting India. He must be treated with respect.
— Rahul Gandhi (@RahulGandhi) April 19, 2019Hemant Karkare gave his life protecting India. He must be treated with respect.
— Rahul Gandhi (@RahulGandhi) April 19, 2019
''భారతదేశాన్ని రక్షించే ప్రయత్నంలో హేమంత్ కర్కరే ప్రాణాలర్పించారు. ఆయన తగిన గౌరవానికి అర్హులు.''
- రాహుల్ గాంధీ ట్వీట్
-
मोदीजी और अमित शाह जी से केवल 4 सवाल-
— Randeep Singh Surjewala (@rssurjewala) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
पहला-भोपाल कि प्रत्याशी प्रज्ञा ठाकुर को आपने भाजपा का टिकट दिया है या नहीं ?
दूसरा सवाल-क्या आप प्रज्ञा ठाकुर के बयान से पल्ला झाड़ कर अपनी ज़िम्मेदारी से मुक्त हो सकते है? 1/2 pic.twitter.com/wF64RVZT3q
">मोदीजी और अमित शाह जी से केवल 4 सवाल-
— Randeep Singh Surjewala (@rssurjewala) April 19, 2019
पहला-भोपाल कि प्रत्याशी प्रज्ञा ठाकुर को आपने भाजपा का टिकट दिया है या नहीं ?
दूसरा सवाल-क्या आप प्रज्ञा ठाकुर के बयान से पल्ला झाड़ कर अपनी ज़िम्मेदारी से मुक्त हो सकते है? 1/2 pic.twitter.com/wF64RVZT3qमोदीजी और अमित शाह जी से केवल 4 सवाल-
— Randeep Singh Surjewala (@rssurjewala) April 19, 2019
पहला-भोपाल कि प्रत्याशी प्रज्ञा ठाकुर को आपने भाजपा का टिकट दिया है या नहीं ?
दूसरा सवाल-क्या आप प्रज्ञा ठाकुर के बयान से पल्ला झाड़ कर अपनी ज़िम्मेदारी से मुक्त हो सकते है? 1/2 pic.twitter.com/wF64RVZT3q
''నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. నేడు దేశ ప్రజల ముందు భాజపా అసలు రంగు బయటపడింది. వారు దేశ వ్యతిరేకులు. అమరవీరుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ.. వారు అన్ని హద్దులు అతిక్రమించారు. ప్రజ్ఞపై ప్రధానమంత్రి కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.''
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
పార్టీతో సంబంధం లేదని భాజపా లేఖ
సాధ్వి ప్రజ్ఞ సింగ్ వ్యాఖ్యలకూ.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని భాజపా అధికారిక లేఖ విడుదల చేసింది. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ములాయం, మాయ ఐక్యరాగం- మోదీపై ధ్వజం