ETV Bharat / bharat

భారీగా తగ్గిన శబరిమల ఆదాయం - n vasu

కొవిడ్​ ఉద్ధృతి కారణంగా శబరిమల ఆలయ ఆదాయం గణనీయంగా తగ్గింది. దర్శనం ప్రారంభమై 39 రోజులైనా రూ. 9.09 కోట్లు మాత్రమే వచ్చాయి. భక్తుల సంఖ్యా భారీగా తగ్గింది.

Sabarimala temple records steep drop in revenue due to COVID restrictions
భారీగా తగ్గిన శబరిమల ఆలయ ఆదాయం
author img

By

Published : Dec 26, 2020, 7:39 AM IST

కొవిడ్ నిబంధనల కారణంగా ఈ ఏడాది కేరళలోని శబరిమల ఆలయ ఆదాయం భారీగా తగ్గింది. ఆలయ దర్శనం ప్రారంభమై 39 రోజులు అవుతున్నా కేవలం రూ. 9.09 కోట్ల ఆదాయమే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఆలయ ఆదాయం రూ. 156 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు 71,706 మంది ఆలయ దర్శనానికి వచ్చారని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్​ వాసు మీడియా సమావేశంలో వెల్లడించారు.

" శబరిమల ఆలయ ఆదాయం చాలా మేరకు తగ్గింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 5 శాతం మంది కూడా ఆలయ దర్శనానికి రాలేదు. హైకోర్టు, ప్రభుత్వం ఆదేశాల మేరకు భక్తుల పరిమితిని దష్టిలో ఉంచుకుని ఆలయ దర్శనానికి అనుమతి ఇస్తున్నాం. మండల-మకరవిలక్కు పండగ సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశాం".

-ఎన్​ వాసు, ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు

ఆలయ ప్రాంగణంలో కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్​ వాసు. ఆలయ దర్శనం ప్రారంభమయ్యాక... 289 మంది కార్యనిర్వాహక సిబ్బందికి పాజిటివ్​గా తేలిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు దర్శనార్థం వచ్చిన భక్తుల్లో 390 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయిందన్నారు.

ఇదీ చదవండి:అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసోం పర్యటనలో షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.