భాజపా ఎంపీ మదన్ లాల్ సైనీ మృతి పట్ల రాజ్యసభ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన గౌరవార్థం సభను 3 గంటల పాటు ఛైర్మన్ వెంకయ్య నాయుడు వాయిదా వేశారు. సమావేశమైన వెంటనే ఈ విషయాన్ని ప్రస్తావించారు ఛైర్మన్. ఆయన సేవలను గుర్తుచేశారు. సభ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
2 నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు.
మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమయ్యాక రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ పూర్తి చేయనున్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై సమాధానమిస్తారు.
సోమవారం మృతి...
ఊపిరితిత్తుల సమస్యతో ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ మదన్ లాల్ సైనీ (75) సోమవారం కన్నుమూశారు. 3 గంటల వరకు సభను వాయిదా వేసేలా రాజ్యసభ ఛైర్మన్, 15 పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
- ఇదీ చూడండి: ఇక బాదుడే: గీత దాటితే లక్ష వరకు జరిమానా!