కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తి భారీ జరిమానా చెల్లించాడు. ఒడిశాలోని దేవ్గఢ్లో ఓ పెళ్లి వేడుకకు భారీగా అతిథులను ఆహ్వానించినందుకు అతడికి జరిమానా విధించారు అధికారులు.
800 మందితో..
దేవ్గఢ్లోని కమలా బాగిచా గ్రామానికి చెందిన వన్ కులన్ టోప్నో.. తన కుమారుడు అమిత్ టోప్నోస్ వివాహ వేడుకలను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి 800 మంది అతిథులు హాజరయ్యారు.
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/od-deo-01-covid-fine-dry-10022_31102020210754_3110f_1604158674_1076.jpg)
విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ పల్లవి నాయక్, స్థానిక పోలీసులు.. పెళ్లి మండపానికి చేరుకున్నారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వరుడి తండ్రికి రూ.లక్ష జరిమానా విధించారు.
ఇదీ చూడండి:ఆ పెళ్లికి 108 మంది ముఖ్య అతిథులు.!