ఒడిశా రవుర్కెలాలో ఓ అంతిమ యాత్రలో 500 మందికి పైగా హాజరై కరోనా భయాలను తుంగలో తొక్కారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో కలకలం రేపుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు నెటిజన్లు.
ఈ ఘటనపై రవుర్కెలాా పోలీసులు స్పందించారు. లాక్డౌన్ నియమాలు ఉల్లంఘించినవారిపై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 167/202, 269/34, అంటువ్యాధుల చట్టం 3ల కింద కేసు నమోదు చేసి.. వారిని వెతికి పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
"రవుర్కెలా, ప్లాంటైట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. రైల్వే కాలనీలో ఈ నెల 8న ఓ హత్య జరిగింది. పోస్ట్మార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. అంతిమ యాత్రలో 500కు పైగా జనం పాల్గొన్నారు. కరోనా కాలంలో మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. వీరి వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశముంది."
-సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రవుర్కెలా
ఇదీ చదవండి: 'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్!