ETV Bharat / bharat

ఆ ఆసుపత్రిలో  రోబోతో రోగులకు సేవలు

author img

By

Published : May 10, 2020, 7:00 AM IST

కరోనా కాలంలో ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో వైద్యులకు సాయపడుతూ.. రోగులకు మందులు, ఆహార పదార్థాలు అందిస్తోంది ఓ రోబో.

Robot to lend helping hand at Chandrapur hospital in Maharastra
ఆ ఆసుపత్రిలో రోగులకు మందులందిస్తోన్న రోబో

మహారాష్ట్ర- చంద్రపూర్​లోని సివిల్​ అసుపత్రిలో రోబో ద్వారా సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రస్తుతం ఇప్పుడున్న సేవలకే పరిమితం కాకుండా.. మరికొన్ని మార్పులతో త్వరలోనే కొవిడ్​ పరీక్షల నమూనాల సేకరణలోనూ ఈ రోబోను ఉపయోగించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు.

రోగులకు మందులు, ఆహార పదార్థాలను అందించే ఈ 'మెడీ రోవర్​ రోబో'ను జిల్లా కలెక్టర్​ డాక్టర్​ కునాల్​ ఖేమ్నర్​.. ఆసుపత్రికి అందించారు. ఈ రోబోను టాటా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. చంద్రపూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్​ కళాశాల వారు రూపొందించారని ఖేమ్నర్​ తెలిపారు.

కొవిడ్​ పరీక్షలకూ.?

30 కేజీల బరువుండి, బ్యాటరీతో పనిచేసే ఈ రోబో.. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులతో కరోనా పరీక్షల నమూనాలను సేకరించేలా రూపొందుతుందని వివరించారు ఖేమ్నర్.

ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్​డౌన్​ ఉల్లంఘన కేసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.